Job Mela | భూదాన్ పోచంపల్లి మండలం జలాల్ పూర్ గ్రామంలోని స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థలో ఈ నెల 7న ఉదయం 10 గంటలకు బ్లూ ఓషియన్ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు జాబ్ మేళా కార్యక్రమం నిర్వహించనున్నట్లు సంస్థ డైరెక్టర్ పీఎస్ఎస్ ఆర్ లక్ష్మి తెలిపారు.
ఈ జాబ్ మేళా ద్వారా ఎంపికైన వారికి హైదరాబాద్( ఆదిభట్ల కొంగరకలాన్)లోని ప్రముఖ మొబైల్ కంపెనీలో స్త్రీలకు ఉద్యోగ అవకాశాలు, తిరుపతి జిల్లా శ్రీ సిటీలోని ప్రముఖ ఏసీ కంపెనీలో పురుషులకు ఉద్యోగ అవకాశాలు కల్పించబడతాయని తెలిపారు. జీతం నెలకు రూ.14,500 నుండి 16,500 ఇవ్వడం జరుగుతుంది. రొటేషన్ షిప్ట్స్, ఉచిత బస్సు, భోజన సదుపాయం, పీఎఫ్, ఈఎస్ఐ సదుపాయం కలదని ఆమె పేర్కొన్నారు.
మీడియాకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తాం : హెచ్‌సీఏ అధ్యక్షుడు అర్శనపల్లి జగన్ మోహన్ రావు
Madhabi Puri Buch | సెబీ మాజీ చీఫ్‌కు ఊరట.. ప్రత్యేక కోర్టు ఉత్తర్వులపై స్టే విధించిన హైకోర్టు
AC Bus Shelter | బోరబండలో ఏసీ బస్ షెల్టర్ కబ్జా.. కిరాయికి ఇవ్వటానికి రెడీస్టు పార్టీ సభ్యులు : ఎస్పీ రోహిత్ రాజు