తుంగతుర్తి, జూన్ 04 : తుంగతుర్తి మండల కేంద్రంలోని రైతు సేవా సహకార సంఘం సొసైటీలో రైతులకు అందుబాటులో జీలుగు విత్తనాలు ఉన్నాయని పీఏసీఎస్ చైర్మన్ గుడిపాటి సైదులు, ఏడీఏ రమేష్ బాబు తెలిపారు. గురువారం పిఏసీఎస్ కేంద్రం వద్ద పలువురు రైతులకు విత్తనాలు పంపిణీ చేసి మాట్లాడారు. రూ.4,950 విలువైన 30 కేజీల బస్తాను 50 శాతం సబ్సిడీతో రూ.2,453కే అందిస్తున్నట్లు చెప్పారు. కావాల్సిన రైతులు పట్టాదారు పాసు పుస్తకం, ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకు రావాలని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీఈఓ యాదగిరి, రైతులు కాసం మల్లయ్య, మాధవరావు, కొమరయ్య పాల్గొన్నారు.