పెన్పహాడ్, నవంబర్ 06 : “జన జాతియా గౌరవ వార్ష పక్ష్వాడా – 2025″ కార్యక్రమంలో భాగంగా అనాజీపురం గ్రామంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు రైతుల సమక్షంలో “జన జాతియా గౌరవ దివస్” కార్యక్రమం గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు జన జాతియా గౌరవ దివస్ ప్రాముఖ్యత, అలాగే స్వాతంత్ర్య సమరయోధుడు అలూరి సీతారామరాజు పాత్ర త్యాగాల గురించి వివరించారు. గ్రామ అభివృద్ధిలో మౌలిక సదుపాయాల ప్రాధాన్యతను కూడా చర్చించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా పార్టిసిపేటరీ రూరల్ అప్రైసల్ (PRA) ఉప కార్యక్రమం రైతు వేదికలో నిర్వహించబడింది. గ్రామంలోని జనాభా, వృత్తులు, పంటలు, నేల రకాలు, నీటి వనరులు, అందుబాటులో ఉన్న వనరులు, చుట్టుపక్కల గ్రామాలు, అలాగే గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటికి పరిష్కారాలు అనే అంశాలపై చర్చ జరిగింది. ప్రజల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో కేవీకే శాస్త్రవేత్తలు, అధికారులు పాల్గొన్నారు.

Penpahad : అనాజీపురంలో “జన జాతియా గౌరవ దివస్ – 2025”