కోదాడ, జూలై 16 : సకాలంలో వర్షాలు కురవాలని, బొడ్రాయమ్మ తల్లి ఆశీస్సులు పట్టణ ప్రజలపై ఉండాలని కోదాడ మున్సిపల్ చైర్ పర్సన్ ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబు అన్నారు. గురువారం మున్సిపల్ పాలకవర్గం, రైతు కమిటీ, బొడ్రాయి కమిటీ ఆధ్వర్యంలో బొడ్రాయమ్మ తల్లికి జలాభిషేకం పట్టణ ప్రజలచే ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సకాలంలో వర్షాలు కురిసి పాడి పంటలతో రైతులు, పట్టణ ప్రజలు ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ దేవరపల్లి మల్లేశ్వరి, కమిషనర్ రమాదేవి, నూనె సులోచన, రామ్ శెట్టి కృష్ణవేణి, రంగు శిరీష, వివిధ పార్టీల నాయకులు పైడిమర్రి సత్తిబాబు, పైడిమర్రి వెంకటనారాయణ, రామినేని శ్రీనివాసరావు, రావెళ్ల కృష్ణారావు ఎండి కాజా, ముత్యాలమ్మ తల్లి కమిటీ సభ్యులు వట్టివేళ్ల రవీందర్ రెడ్డి, కౌన్సిలర్స్ తోట జ్యోతి శ్రీనివాస్, గంధం బాలేంద్ర పాండు, చీమ నరేష్, పి.ఏసు పాదం, కర్రీ సుబ్బారావు, నరసయ్య, ఒంటి పులి శ్రీను, ఉప్పుగళ్ల శ్రీనివాస్, పందిరి సత్యనారాయణ, జిల్లేపల్లి నాగేశ్వరరావు, వేముల రాముడు, తోట వెంకటేశ్వర్లు, సుంకర సత్యనారాయణ, మురళి పుల్లయ్య, ఓం శ్రీనివాస్, పురపాలక సంఘం సభ్యులు, కమిటీ సభ్యులు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు.