తుంగతుర్తి, అక్టోబర్ 15 : సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ బాలుర పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న జక్కి శ్రీకర్ అండర్-14 విభాగంలో రాష్ట్రస్థాయి కబడ్డీ క్రీడలకు ఎంపికయ్యాడు. మండల, జిల్లా స్థాయిలో రాణించి ఈ నెల 16 నుండి 19 వరకు సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో జరిగే రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికయ్యారని పాఠశాల హెచ్ఎం ప్రవీణ్ కుమార్, పీడీ కొండగడుపుల యాకయ్య తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పేద కుటుంబంలో పుట్టి ఒక పక్క చదువుతో పాటు, మరొక పక్క క్రీడలో రాణించడం అభినందనీయమన్నారు.