మాజీ మంత్రి, సూర్యాపేట శాసన సభ్యులు గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి పుట్టిన రోజు వేడుకలను శుక్రవారం ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కేక్ కట్‌చేసి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఉద్యమ కాలం నుంచి కేసీఆర్ వెన్నంటే ఉండి ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కోవటంతోపాటు రాష్ట్రం సిద్ధించిన తర్వాత ఉమ్మడి నల్లగొం డ జిల్లాను అన్ని రంగాల్లో తీర్చిదిద్దారని కొనియాడారు. పదేండ్లలో బీఆర్ఎస్ చేసిన అభివృద్ధే జిల్లాలో కనిపిస్తుందని, వచ్చే ఎన్నికల్లో జిల్లాలో బీఆర్ఎస్ అన్ని స్థానాలను కైవసం చేసుకుంటుందని దీమా వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అభివృద్ధికి నోచుకోని ఉమ్మడి నల్లగొండ జిల్లాను అన్ని రంగాల్లో ముం దుకు నడిపిన ఘనత జగదీశ్‌రెడ్డికే దక్కిందన్నారు. కార్యకర్తల సమక్షంలో గ్రామగ్రామాన కేక్ కట్ చేసి సంబురాలు నిర్వహించారు. పేదలకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. పాలకవీడు మండలం మహంకాళీగూడెంలోని కృష్ణా నదిలో పడవల మీద మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి జెండాలతో చేసిన ప్రదర్శన పలువురిని విశేషంగా అలరించింది. పుట్టినరోజు సందర్భంగా మాజీ మంత్రి, సూర్యాపేట శాసన సభ్యులు గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి కుటుంబసభ్యులు హైదరాబాద్‌లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆశీర్వదం తీసుకున్నారు.