సూర్యాపేట, జూన్ 22(నమస్తేతెలంగాణ) : బనకచర్ల ప్రాజెక్టుకు వత్తాసు పలికిన సీఎం రేవంత్‌రెడ్డి, బండి సంజయ్ వ్యాఖ్యలపై మాజీ మంత్రి, సూర్యాపేట ఎ మ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్, తెలుగుదేశం రెం డూ తెలంగాణాకు ద్రోహం చేసిన పార్టీలే అని అన్నారు. ఆదివారం సూర్యపేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో జగదీ శ్‌రెడ్డి మాట్లాడుతూ ‘ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉ న్నప్పుడు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కృష్ణానది నీళ్లను దోచుకెళ్లారు. నేడు ఏపీ సీఎం చం ద్రబాబు రూపంలో మరోసారి తెలంగాణ జల దోపిడీకి గురవుతోంది.
ఆ రెండు పార్టీల కలయికతో పుట్టిన హైబ్రిడ్ కలుపు మొక్క రేవంత్‌రెడ్డి. అలాంటి వ్యక్తి తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉండడం మన దురదృష్టం’ అని అన్నారు. తెలంగాణను ఊడగొట్టి ఆంధ్రలో కలిపింది.. ఆనాడు వందలాది మందిని బలిగొన్నది కాంగ్రెస్ పార్టీయేనని ఆయన విమర్శించారు. ‘కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ రాష్ర్టాన్ని సా ధించే క్రమంలో ఆనాడు అడ్డుపడ్డది చం ద్రబాబే. తెలంగాణాలో వలసలు, కరువు కాటకాలు, ఆకలి చావులకు కారణమైంది టీడీపీ, కాంగ్రెస్సే. తెలంగాణ ప్రజలు మళ్లీ కరువు కోరల్లో చిక్కుకునేలా రేవంత్‌రెడ్డి పాలన సాగిస్తున్నారు.
నదులు ఎక్కడున్నాయో తెలియని రేవంత్‌రెడ్డి ఇక్కడ దేనినైనా అమ్మేందుకు వెనుకాడట్లేదు. తన స్వార్థం కోసం ఎంతటి దుర్మార్గానికైనా ది గజారుతున్న నాయకుడు రేవంత్‌రెడ్డి’ అ ని అన్నారు. కృష్ణానది ఎప్పుడో ఆంధ్రార్ప ణం అయిందన్నారు. 350 టీఎంసీల ప్రా జెక్టును కట్టి రాజశేఖర్‌రెడ్డి దుర్మార్గంగా కృష్ణానది నీటిని తీసుకుపోతుంటే ఆనాటి కాంగ్రెస్, టీడీపీ నాయకులు నోరు మెదపలేదన్నారు. ఈనాడు గోదావరి నీటిని కూడా దోచుకుపోతుంటే రేవంత్‌రెడ్డి సీఎంగా ఉండీ నోరు మెదపలేని దుస్థితి నెలకొందన్నారు. మన నీళ్లు మనం వాడుకోవడానికి చంద్రబాబు అనుమతి అవసరమా అని ప్రశ్నించారు. తన పదవిని కా పాడుకోవడం కోసం రేవంత్‌రెడ్డి తెలంగాణ మొత్తం దోచుకుపోయినా స్పందించడన్నారు. ఈ దారుణాన్ని బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ సహించరని, కేసీఆర్ మరో ఉ ద్యమం చేస్తే తప్ప జల దోపిడీని ఆపలేమన్నారు.
కేసీఆర్ పెట్టిన ఒక్క సభతో కాంగ్రెస్‌లో వణుకు మొదలైందని, తెలంగా ణ హక్కులను ఆంధ్రాకు అమ్ముతుంటే కేసీఆర్ చూస్తూ కూర్చోరని అన్నారు. మో దీ, చంద్రబాబు, రేవంత్ కుట్రలను తిప్పి కొట్టి తెలంగాణ హక్కులను కాపాడడంలో బీఆర్ఎస్ ముందుంటుందన్నారు. కేసీఆర్ ఉండగా తెలంగాణ ప్రజలకు నష్టం కలగనివ్వడని, ప్రజలందరినీ ఐక్యం చేసి రాష్ట్ర సాధన ఉద్యమాన్ని తలపించేలా మరో పోరాటం తప్పదన్నారు. తెలంగాణను కాపాడేందుకు బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ ఉన్నారని, రేవంత్ నాటకాన్ని.. చంద్రబాబు ద్రోహాన్ని బయట పెట్టి తెలంగాణ హక్కుల్ని కాపాడుకుంటామని అ న్నారు.
బండి సంజయ్, రేవంత్‌రెడ్డి వీ రంతా తెలంగాణ ద్రోహులేనని, వీరిలో ఏ ఒక్కరికీ తెలంగాణ పట్ల సోయి లేదని అ న్నారు. బీజేపీకి 8 మంది ఎంపీలను ఇస్తే వారు రిటర్న్ గిఫ్ట్ కింద బనకచర్ల రూపం లో చంద్రబాబుకు గోదావరి నీటిని దోచి పెట్టారన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌కు పదవుల సోయి తప్ప తెలంగాణ ప్రజలపై ఏ మా త్రం చిత్తశుద్ధిలేదన్నారు. కేసీఆర్‌ను జైల్లో పెట్టేందుకు కాంగ్రెస్, బీజేపీ ఒకర్ని మించి మరొకరు పోటీ పడుతున్నారని, ఎవరెన్ని కుట్రలు చేసినా కేసీఆర్‌ను జైల్లో పెట్టడం ఎవరి తరం కాదన్నారు. ఎప్పటికైనా కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష అన్నారు. ఆయన వెంట జడ్పీ మాజీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణగౌడ్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మ న్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, మాజీ ఎంపీపీ నెమ్మాది భిక్షం, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై.వెంకటేశ్వర్లు తదితరలు ఉన్నారు.