నేరేడుచర్ల, మార్చి 26 : మాజీ సీఎం కేసీఆర్ హయాంలో దేశంలో ఎక్కడా లేని విధంగా సర్వమతాలకు ప్రాధాన్యం ఇచ్చారని, పండుగలకు కానుకలు అందజేశారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. రంజాన్ పండుగను పురస్కరించుకొని బుధవారం నేరేడుచర్ల పట్టణంలోని జాన్‌పహాడ్ రోడ్డులో గల మసీదులో ముస్లింలకు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇఫ్తార్ విందుకు జగదీశ్‌రెడ్డితోపాటు మాజీ ఎంపీ, బీఆర్ఎస్ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్, పార్టీ నియోజకవర్గ సమన్వయ కర్త ఒంటెద్దు నర్సింహా రెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు చేసే కఠిన ఉపవాస దీక్షలు ఫలించాలని, అల్లా ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని పండుగులను గౌరవించారని తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో నేరేడుచర్ల మున్సిపాలిటీలో మైనారిటీల సంక్షేమ కోసం రూ. 30లక్షలు మంజూరు చేశారని గుర్తు చేశారు. అనంతరం ముస్లింలకు ముందస్తుగా రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.
కార్యక్రమంలో నేరేడుచర్ల, పాలకవీడు, గరిడేపల్లి బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షులు అరిబండి సురశ్బాబు, కిష్టపాటి అంజిరెడ్డి, కృష్ణానాయక్, డీసీసీబీ డైరెక్టర్ దొండపాటి అప్పిరెడ్డి, మాజీ ఎంపీపీలు చెన్నబోయిన సైదులు, లకుమళ్ల జ్యోతిభిక్షం, పట్టణ ప్రధాన కార్యదర్శి చిత్తలూరి సైదులు, హుజూర్నగర్ మాజీ జడ్పీటీసీ, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్లు కొప్పుల సైదిరెడ్డి, కడియం వెంకటరెడ్డి, మాజీ గ్రంథాలయ చైర్మన్ గుర్రం మార్కండేయ, నాయకులు కుంకు చిన్నయ్య, ఇనపాల పిచ్చిరెడ్డి, మర్రు శ్రీను, రవీందర్, నాగరాజు, మైనార్టీ నాయకులు ఇబ్రహీం, ఖాదర్, షోయబ్, హుస్సేన్, ఖాజా, జానీ, బషీర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం బీఆర్ఎస్ నాయకుడు ఇంతియాజ్ ఇంటికి ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి వెళ్లి పరామర్శించారు.