– సూర్యాపేట డీఎస్పీ ప్రసన్న కుమార్
సూర్యాపేట టౌన్, మార్చి : ప్రయాణికులను సురక్షితంగా గమ్యం చేర్చడం ఆర్టీసీ డ్రైవర్ల బాధ్యత అని సూర్యాపేట డీఎస్పీ వి.ప్రసన్నకుమార్ అన్నారు. అరైవ్ అలైవ్ రోడ్డు భద్రతా కార్యక్రమంలో భాగంగా సూర్యాపేట ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో సోమవారం ఆర్టీసీ బస్ డిపోలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. నిబంధనల ప్రకారం వాహనాలను నడపాలని, అతివేగంగా వెళ్లకుండా నిదానంగా వెళ్లాలని సూచించారు. బస్సు డ్రైవర్లకు రోడ్డు భద్రతా నియమాలు, ప్రయాణ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఆర్టీసీ సిబ్బందితో వాహనాలను జాగ్రత్తగా నడుపుతామని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఇన్స్పెక్టర్ వెంకటయ్య, ట్రాఫిక్ ఎస్ఐ సాయిరాం, ఆర్టీసీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.