ఎంజీయూలో అదనపు హాస్టళ్లు
నల్లగొండలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీ విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు హాస్టల్ వసతి కల్పించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే వివిధ కోర్సులు చదివే 1,050 మంది గర్ల్స్ , బాయ్స్‌కు వేర్వేరుగా హాస్టళ్లు ఉన్నాయి.
- ఇప్పటికే రూ.20 కోట్లు మంజూరు చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం
- గిరిజన శాఖ ఆధ్వర్యంలో నిర్మాణం చేపట్టేందుకు ప్రణాళిక
- యూనివర్సిటీని సందర్శించనున్న ఉన్నతాధికారులు.. త్వరలో పనులు ప్రారంభం
- ప్రస్తుతం 1,050 మంది గర్ల్స్, బాయ్స్‌కు హాస్టల్ వసతి
- భవిష్యత్‌లో రెసిడెన్షియల్ వర్సిటీగా తీర్చేదిద్దేందుకు అడుగులు
నల్లగొండలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీ విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు హాస్టల్ వసతి కల్పించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే వివిధ కోర్సులు చదివే 1,050 మంది గర్ల్స్ , బాయ్స్‌కు వేర్వేరుగా హాస్టళ్లు ఉన్నాయి. భవిష్యత్‌లో రెసిడెన్షియల్ యూనివర్సిటీగా తీర్చిదిద్దే లక్ష్యంగా కొత్త హాస్టళ్లను నిర్మిస్తున్నారు. ఇందులో భాగంగా బీఆర్ఎస్ సర్కారు మరో 250 మందికి వసతి కల్పించేలా రెండు హాస్టళ్ల నిర్మాణానికి రూ.20 కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు స్థలాన్ని పరిశీలించి నిర్మాణాలు చేపట్టడానికి ఉన్నతాధికారులు త్వరలో యూనివర్సిటీకి రానున్నారు. గిరిజన శాఖ ఆధ్వర్యంలో పనులు ప్రారంభించి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు వర్సిటీ అధికారులు తెలిపారు.
నల్లగొండలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీలో వివిధ కోర్సులు చదివే విద్యార్థులందరికీ హాస్టల్ వసతి కల్పించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు నూతన భవన నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు. ఇందుకు సంబంధించిన జీఓ 64ను గత జూలైలో గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో విడుదల చేశారు. ఇందుకు అవసరమైన ఎంఓయూను సైతం ఆ శాఖ అధికారులతో ఎంజీయూ వీసీ ప్రొఫెసర్ సీహెచ్ గోపాల్‌రెడ్డి చేశారు. నూతన అదనపు హాస్టళ్ల నిర్మాణాలు చేసేందుకు అనుమతులు ఇవ్వడంతోపాటు అందుకు అవసరమైన రూ.20కోట్లను గిరిజన సంక్షేమ శాఖకు మంజూరు చేశారు. త్వరలోనే రాష్ట్ర స్థాయి అధికారుల బృందం సభ్యులు ఎంజీయూను సందర్శించనున్నారు. హాస్టల్ భవన నిర్మాణాలు చేసే ప్రాంతాలను పరిశీలించి మాస్టర్ ప్లాన్‌తో పనులు ప్రారంభం చేయనున్నట్లు వర్సిటీ అధికారులు వెల్లడించారు.

అందుబాటులోకి కొత్త హాస్టల్ భవనాలు
ఎంజీయూలో ఇప్పటికే విద్యార్థిని, విద్యార్థులకు వేర్వేరుగా సకల సౌలత్‌లతో హాస్టల్ భవనాలు ఉన్నాయి. వాటిల్లో దాదాపు 1,050 మంది విద్యార్థులు వసతి పొందుతూ విద్యనభ్యసిస్తున్నారు. అయితే.. గత ప్రభుత్వం గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రస్తుతం ఉన్న హాస్టళ్లకు అనుసంధానం చేస్తూ నూతన హాస్టల్ భవనాలు నిర్మించాలని సంకల్పించింది. దీనికి అవసరమైన రూ.20కోట్ల నిధులు సైతం మంజూరు చేసింది. వర్సిటీలో హాస్టల్ భవనాలు ఎక్కడ నిర్మించాలనే దానిపై త్వరలోనే అధికారుల బృందం పరిశీలన చేయనున్నది. ఆ డబ్బుతో 125 మంది విద్యార్థులు, మరో 125మంది విద్యార్థినులకు ఆశ్రయం ఇచ్చేలా కొత్త భవనాలు నిర్మించనున్నట్లు అధికారులు తెలిపారు.
రెసిడెన్షియల్ వర్సిటీగా తీర్చిదిద్దేలా..
ఎంజీయూలో వివిధ కోర్సుల్లో చేరే విద్యార్థులకు ప్రస్తుతం హాస్టల్ వసతి కల్పించే అవకాశం లేదు. దూర ప్రాంతాల విద్యార్థులకు మాత్రమే హాస్టల్స్‌లో అడ్మిషన్లు కల్పిస్తున్నారు. కొన్ని కోర్సుల్లో ఫస్టియర్ విద్యార్థులకు హాస్టల్ అడ్మిషన్ ఉండదు. అయితే.. భవిష్యత్‌లో ఎంజీయూ క్యాంపస్ కళాశాలలో చేరిన ప్రతి విద్యార్థికీ హాస్టల్ సౌకర్యం కల్పించేలా ప్రణాళికలు చేస్తున్నారు. దీంతో రాబోయే కాలంలో ఎంజీయూను మహాత్మాగాంధీ రెసిడెన్షియల్ వర్సిటీగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో అదనపు హాస్టల్ భవన నిర్మాణాలు చేస్తున్నారు.
విద్యార్థుల శ్రేయస్సే లక్ష్యంగా ప్రణాళికలు
ఎంజీయూలో ప్రస్తుతం ఉన్న హాస్టల్ భవనాలకు అనుసంధానంగా కొత్త భవనాలు నిర్మించాలని గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సంకల్పించగా.. ఇప్పటికే ఆ శాఖతో ఎంఓయూ చేశాం. దానికి అవసరమైన రూ.20కోట్ల నిధులను ఆ శాఖ జీఓ నెం.64తో మంజూరు చేసింది. ఈ నిర్మాణాలు పూర్తయితే మరో 250మందికి విద్యార్థులకు హాస్టల్ వసతి అందుబాటులోకి వస్తుంది. భవిష్యత్‌లో ఎంజీయూలో చేరే ప్రతి విద్యార్థికీ హాస్టల్ వసతితో విద్యనందించాలనే సంకల్పంతో పాలకమండలి ఆమోదంతో ప్రణాళికలు చేశాం. దీంతో ఎంజీయూ భవిష్యత్‌లో రెసిడెన్షియల్ వర్సిటీగా మారుతుంది. అదేవిధంగా విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి బాటలు వేసేలా పరిశోధనలకు అధిక ప్రాధాన్యం కల్పిస్తూ అన్ని రంగాల్లో ఎంజీయూను ఉన్నత స్థానంలో ఉంచి విద్యార్థుల శ్రేయస్సే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Leaders: జంతర్ మంతర్‌లోకి చొరబాటు.. 5 రోజుల కస్టడీలోకి సీజేపీ నేతలు
జగిత్యాల జిల్లాలో విషాదం.. వ్యవసాయ బావిలో పడి ఇద్దరు యువకులు మృతి
Cult | ‘కల్ట్’ వాయిదా పడినట్టేనా .. విశ్వక్ సేన్ సినిమా రిలీజ్‌పై ఇంకా రాని క్లారిటీ!
Viral Video | కాంగ్రెస్‌కు దగ్గరుండి ఓట్లు వేయించిన.. ఇప్పుడు నా చేనే ఎండబెట్టిండ్రు.. నాగర్‌కర్నూల్ జిల్లాలో రైతు గోపాల్ ఆవేదన
Sai Pallavi | జగపతిబాబు షోలో సాయి పల్లవి సందడి.. ‘జయమ్ము నిశ్చయమ్మురా’ రెండో సీజన్ ఎప్పటినుండి అంటే..?
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

