‘విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి’
విద్యారంగ సమస్యల పరిష్కారానికై నేడు వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త విద్యా సంస్థల బంద్ కు డీవైఎఫ్ఐ మద్దతు తెలిపి బందులో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర కమిటీ సభ్యుడు పతాని శ్రీను, మాడ్గులపల్లి మండల కార్యదర్శి ఎలిజాల రమేశ్...
– డీవైఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు పతాని శ్రీను
మాడ్గులపల్లి, జూలై 10 : విద్యారంగ సమస్యల పరిష్కారానికై నేడు వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త విద్యా సంస్థల బంద్ కు డీవైఎఫ్ఐ మద్దతు తెలిపి బందులో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర కమిటీ సభ్యుడు పతాని శ్రీను, మాడ్గులపల్లి మండల కార్యదర్శి ఎలిజాల రమేశ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విద్యా శాఖ మంత్రిని కేటాయించాలన్నారు. రాష్ట్రంలో ఉన్న 47 వేల ప్రభుత్వ పాఠశాలలను 4 వేలకు కుదించాలని రాష్ట్ర ప్రభుత్వం భావించడం సరికాదన్నారు. ఒక వైపు పాఠశాలలు ప్రారంభమై నెల రోజులు కావస్తున్నా యూనిఫామ్స్ ఇవ్వలేదన్నారు. ప్రతి పాఠశాలల్లో కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు చేయాలని కోరారు. విద్యార్థులకు ఉచిత రవాణా సౌకర్యం కల్పించి అన్ని ప్రాంతాలకు బస్సులను పునరుద్దరించాలన్నారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ హాస్టళ్లలో చదువుతున్న విద్యార్థులకు నోట్ పుస్తకాలు అందించడం లేదన్నారు. రాష్ట్రంలో గత 6 సంవత్సరాల నుండి స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ సుమారు రూ.10,500 కోట్లు వెంటనే విడుదల చేయాలన్నారు. అదేవిధంగా ప్రైవేటు విద్యా సంస్థల ఫీజుల దోపిడీని అరికట్టాలన్నారు. ఫీజు నియంత్రణ చట్టం అమలు చేయాలన్నారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. కరెంట్, ఇంటర్నెట్, త్రాగు నీరు, వంట షెడ్లు, మరుగుదొడ్లు సౌకర్యం కల్పించాలన్నారు. అన్ని పాఠశాలల్లో ఖాళీగా ఉన్న నాన్ టీచింగ్, ఇతర పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jammu and Kashmir | జమ్మూ కాశ్మీర్లో అక్రమ చొరబాటుకు యత్నం.. ఇద్దరు ఉగ్రవాదుల కాల్చివేత
Vijayan: మాజీ సీఎం విజయన్ ఇంటికి నోటీసులు అతికించిన ఈడీ
Girl | ఈ యువతి కారుపై ఎక్కి ఏం చేస్తుందో చూడండి.. వీడియో
Music Director Deva | చిత్ర పరిశ్రమలో విషాదం.. ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
Mahela Jayawardene | హెడ్ కోచ్ జయవర్ధనేతో బంధానికి తెర.. కొత్త హెడ్కోచ్ కోసం ముంబై ఇండియన్స్ కసరత్తు..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

