మునుగోడు, ఏప్రిల్ 04 : తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 16 నెలలు పూర్తయింది. కానీ ఇప్పటి వరకు ఒక్క పథకం కూడా అమలు చేయలేక పౌరులను నిర్బంధాల పాలుచేస్తూ నిరంకుశ పాలన కొనసాగిస్తుందని బీజేపీ నల్లగొండ జిల్లా ఉపాధ్యక్షుడు దర్శనం వేణుకుమార్ అన్నారు. ఇదేనా ప్రజా పాలన అంటే, ఇదేనా ఇందిరమ్మ రాజ్యం అంటే అని ఆయన ప్రశ్నించారు. అబద్ధపు 6 గ్యారంటీలు, 420 హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ హామీలను, గ్యారంటీలను తుంగలో తొక్కిందన్నారు. ఇందుకు నిరసనగా బీజేపీ ఆధ్వర్యంలో శుక్రవారం మునుగోడు మండల పరిధిలోని గూడపూర్ గ్రామంలో ప్రజల నుండి వినతులు స్వీకరించినట్లు తెలిపారు.
ఇచ్చిన హామీలు
1.రైతు భరోసా… గోవిందా
2. రైతు బీమా… గోవిందా
3. కల్యాణలక్ష్మి పెంపు… గోవిందా
4. మహిళలకు రూ.2500… గోవిందా
5. ఆసరా పింఛన్ల పెంపు… గోవిందా
6. విద్యార్థినులకు స్కూటీలు… గోవిందా
7. ఉచిత కరెంట్… గోవిందా
8. దళిత బంధు… గోవిందా
9. రైతు రుణమాఫీ… గోవిందా
ఇంకా అనేక పథకాలకు మంగళం పాడుతున్నట్లు తెలిపారు. దీనికి నిరసనగా బీజేపీ గూడపూర్ గ్రామంలో బూత్ నబర్ 166, వేముల శ్రీరంగం బూతు నంబర్ 167లో ఆరు గ్యారంటీలపై ప్రజల నుండి వినతులు స్వీకరించడం జరిగిందని, ఈ వినతులను తాసీల్దార్, జిల్లా కలెక్టర్కు అందజేయనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా మాజీ కార్యదర్శి వేదాంత గోపీనాథ్, బీజేవైఎం కార్యదర్శి పుల్కారం సైదులు, సీనియర్ నాయకులు నరసింహ, కిసాన్ మోర్చా అధికార ప్రతినిధి వెంకన్నగౌడ్, మండల పార్టీ ఉపాధ్యక్షుడు కొత్త శంకర్, బొలుగురు కృష్ణ, మండల ప్రధాన కార్యదర్శి మోగుదాల లింగస్వామి, అక్కనపెల్లి సతీశ్, బుల్లెపల్లి వెంకన్న, మనోహర్, అఖిల్, రాజు పాల్గొన్నారు.