Irrigation Water | అప్పుడే మొదలైన సాగునీటి కష్టాలు.. ఆందోళనలో రైతులు..!
Irrigation Water | ఇప్పుడిప్పుడే ఎండలు ముదురుతున్నాయి. దీంతో అన్నదాతకు సాగునీటి కష్టాలు మొదలయ్యాయి. చేతికొచ్చిన పంట కండ్ల ముందే మాడి పోతుండడంతో నల్కొండ జిల్లా పెన్ పహాడ్ (Penpahad ) రైతులు దిక్కుతొచ్చని స్థితిలో ఉన్నారు.
పెన్ పహాడ్ : ఇప్పుడిప్పుడే ఎండలు ముదురుతున్నాయి. దీంతో అన్నదాతకు సాగునీటి కష్టాలు ( Irrigation water ) మొదలయ్యాయి. ఎండిపోతున్న పంటలను కాపాడేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. చేతికొచ్చిన పంట కండ్ల ముందే మాడి పోతుండడంతో నల్కొండ జిల్లా పెన్ పహాడ్ (Penpahad ) రైతులు దిక్కుతొచ్చని స్థితిలో ఉన్నారు.
శ్రీరాంసాగర్ ఫేజ్-2 ఆయకట్టు పరిధిలో వార బంది లెక్క నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో చివరి ఆయకట్టు పంట పొలాలకు నీళ్లు అందక ఎండి పోతున్నాయని చిన్న గరాయ కుంట రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. గత యాసంగిలో పంట సాగుకు సరిపడా నీళ్లు విడుదల చేయక చేతికొచ్చిన పంట పొలాలు పశువులపాలు చేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు.
గతం కంటే ఇప్పుడు కేవలం 2 ఎకరాలు నాటు వేసిన అదికూడా పారె పరిస్థితి లేకుండా పోయిందని అన్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్( KCR) అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీళ్లు రావడంతో శ్రీరాంసాగర్ ఆయకట్టుకు ఎలాంటి అడ్డంకులూ లేకుండా 9 సంవత్సరాల పాటు వరిని పండించుకున్నామన్నారు .
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నీళ్ల కోసం అరిగోస పడుతున్నామని పేర్కొన్నారు. సంబంధిత అధికారులు చర్య తీసుకొని చివరి ఆయకట్టు వరకు నీరు అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

