తుంగతుర్తి , జూలై 06 : కన్నెపల్లి పంప్ హౌస్ వద్ద మోటార్లను ఆన్ చేసి తుంగతుర్తి నియోజకవర్గ రైతాంగానికి ఎస్సారెస్పీ కాల్వల ద్వారా కాళేశ్వరం గోదావరి జలాలు అందించాలని డిమాండ్ చేస్తూ తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో సోమవారం బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ మాజీ మండల అధ్యక్షుడు తాటికొండ సీతయ్య మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే స్పందించి తుంగతుర్తి రైతాంగాన్ని గోదావరి జలాలతో ఆదుకోవాలని కోరారు. రేవంత్ రెడ్డి సర్కార్ ప్రవేశపెట్టిన యూరియా యాప్ ను వెంటనే రద్దు చేయాలని దానివల్ల రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వేసవి కాలం ఇవ్వాల్సిన రైతు భరోసా నిధులు కూడా రైతులకు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
అదే విధంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు వృద్ధులు, వితంతువులకు నెలకు రూ.4 వేల పెన్షన్, వికలాంగులకు రూ.6 వేల పెన్షన్, మహిళలకు నెలకు రూ.2,500తో పాటు అర్హులైన లబ్ధిదారులకు వెంటనే నూతన పింఛన్లు మంజూరు చేయాలని అమలు చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు గుండగాని రాములు గౌడ్, తూనికి సాయిలు, తడకమళ్ల రవికుమార్, మట్టిపల్లి వెంకట్, చింతకుంట్ల మనోజ్, కడారి దాసు, గడ్డం సోమేశ్, యాదగిరి, మధు , వెంకన్న, సాయికిరణ్, వెంకటేష్, నాగమల్లు, మల్లికార్జున్ పాల్గొన్నారు.

కాళేశ్వరం ద్వారా రైతులకు సాగునీరు అందించాలి : తాటికొండ సీతయ్య