తిప్పర్తి, జూలై 31 : తిప్పర్తి మండల కేంద్రంలో డీ40,39 కాల్వలకు పూర్తిస్థాయి లో నీటిని విడుదల చేసి చివరి ఆయకట్టు వరకు సాగునీరందించాలంటూ తిప్పర్తి మండల కేంద్రం మీదుగా వెళ్లే నార్కట్ల్లి -అద్దంకి బైపాస్ రోడ్డుపై రైతులు రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు రైతులు, మాజీ జడ్పీటీసీ తండు సైదులు గౌడ్ మాట్లాడుతూ నాగార్జునసాగర్ నుంచి 26 గేట్ల ద్వారా నీళ్లు పారుతున్నప్పటికీ జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు కనీస అవగాహన లేకుండా నల్లగొండ జిల్లాను ఎండ బెడుతున్నారన్నారు. ఉదయ సముద్రాన్ని 1.5 టీఎంసీలతో నింపి ఆయకట్టు పరిధిలోని అన్ని చెరువులు నింపి పంటలకు నీరందించాలని డిమాండ్ చేశారు. అధికారులు వారబందీ పేరుతో అయిటిపాముల కాల్వకు వా రం రోజులుగా నీరు వదులుతున్నారే కానీ, తిప్పర్తి మండలంలోని డీ 40,39 కాల్వకు వారబందీ అమలు చేయడం లేదన్నారు. అధికారులు, అధికార పార్టీ నాయకులు ఫొటోలకు ఫోజులివ్వడం తప్ప పూర్తిస్థాయి లో చివరి ఆయకట్టు వరకు నీరందించడం లేదన్నారు. ఇప్పటికైనా అధికారులు అన్ని చెరువులు నింపే ప్రయత్నం చేయాలన్నా రు.
మంత్రి కోమటిరెడ్డి తిప్పర్తి మండలాన్ని ఎండబెట్టి తన సొంత గ్రామమైన బ్రాహ్మణ వెల్లెంల ప్రాజెక్టుకు నీళ్లు తీసుకుపోతున్నారని, ఇది తిప్పర్తి మండల ప్రజలను అవమానించడమేనన్నారు. నకిరేకల్ శాసన సభ్యుడు తన ప్రాంతంలోని చెరువులు నిం పుకున్నప్పుడు, మరి నల్లగొండ ఎమ్మెల్యే, మంత్రి కోమటిరెడ్డి తనకు ఓటేసిన తిప్పర్తి మండల ప్రజానీకంపై ఎందుకు వివక్ష చూ పుతున్నారో రైతులకు చెప్పాలన్నారు. ఇప్పటికైనా అధికార పార్టీ నాయకులు కళ్లు తెరి చి, మండలంలోని చెరువులు నింపేలా అధికారులపై, మంత్రిపై ఒత్తిడి తెచ్చి రైతులను ఆదుకోవాలన్నారు. ఆదివారంలోగా పూర్తి స్థాయిలో కాల్వలకు నీటిని వదలకపోతే సోమవారం కలెక్టరేట్‌ను ముట్టడిస్తామన్నా రు. కార్యక్రమంలో గుండెబోయిన రామచంద్ర, సైదులు, మన్నెం భిక్షం, దొంగరి వెంకన్న, చిన్నగొని వెంకన్న,అశోక్ రెడ్డి, రైతులు రొట్టెల జానయ్య, దేవిరెడ్డి లింగారెడ్డి, చింతకుంట్ల దయాకర్‌రెడ్డి, నూకల ప్రవీణ్, రావుల సందీప్, నూకల రాజీవ్, బైరగోని శ్రీను, జాకటి బాలయ్య, కట్టకిట్టు, గుండు రవి, జానీ పాషా, కస్పరాజు వెం కన్న, రొట్టెల సైదులు, మర్రి వెంకన్న, దేవిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.
డీ40,39 కాల్వల ద్వారా నీటిని పూర్తిగా విడుదల చేసి కాల్వ చివరి భూములకు నీరందించాలి. పోయినసారి కూడా కాల్వలకు సరిగా నీరు రా లేదు. ఇప్పుడు పుష్కలంగా నీళ్లు వస్తున్నా ఇంకా కాల్వలకు పూర్తిగా వదలడం లేదు. అయిటిపాముల వైపు ఉన్న కాల్వకు మాత్రం ఎప్పుడూ నీళ్లు పారుతుంటే మా సైడు ఉన్న కాల్వలకు మాత్రం నీరు రావడంలేదు. మాకు ముందుగా వదిలితే ముందుగా నాట్లు వేసుకునేవాళ్లం. ఇప్పటికైనా అధికారులు కాల్వలకు నీళ్లు పూర్తిగా వదిలి చెరువులు నింపి రైతులను ఆదుకోవాలి.
సాగర్ నిండి నీళ్లు ఉ త్తగా సముద్రంలోకి పొతుంటే ఇక్కడ ఉ న్న అధికారులు మా త్రం కాల్వలకు పూర్తి గా నీళ్లు వదులుతలేరు. పానగల్ రిజర్వాయర్ ద్వారా నీళ్లను బి.వెల్లంలకు తరలిస్తున్నరే కానీ, ఇక్కడ ఉన్న కాల్వలకు నీళ్లు వదిలి చెరువులను నింపడం లేదు. వివక్ష చూపకుండా తిప్పర్తి మండల రైతులకు కాల్వల ద్వారా సాగునీరందించాలి.