ముమ్మరంగా పశు వైద్య శిబిరాలు.. మేలుజాతి దూడల ప్రదర్శన
ప్రజా పాలన -ప్రగతి ప్రణాళికలో భాగంగా నల్లగొండ జిల్లాలోని అన్ని మండలాలలో శుక్రవారం పశువులకు గర్భకోశ వ్యాధుల నివారణ శిబిరాలు, మేలుజాతి దూడల ప్రదర్శన అలాగే పశువైద్య శిబిరాలు నిర్వహించటం జరిగింది. జిల్లాలోని దామరచర్లలో జరిగిన శిబిరానికి ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్..
నీలగిరి, మే 08 : ప్రజా పాలన -ప్రగతి ప్రణాళికలో భాగంగా నల్లగొండ జిల్లాలోని అన్ని మండలాలలో శుక్రవారం పశువులకు గర్భకోశ వ్యాధుల నివారణ శిబిరాలు, మేలుజాతి దూడల ప్రదర్శన అలాగే పశువైద్య శిబిరాలు నిర్వహించటం జరిగింది. జిల్లాలోని దామరచర్లలో జరిగిన శిబిరానికి ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ హాజరై శిబిరాన్ని ప్రారంభించి రైతులను ఉద్దేశించి మాట్లాడారు. పశువులు రైతులకు మంచి ఆదాయ వనరు కాబట్టి శాస్త్రీయ పద్ధతిలో పశువులను పోషించుకున్నట్లయితే మంచి ఆదాయం లభిస్తుందని తెలిపారు. ప్రతి రైతు కూడా విధిగా పచ్చి మేతలు సాగు చేసుకున్నట్లయితే పాడి పరిశ్రమ లాభసాటిగా ఉంటుందన్నారు. గుట్టకింద అన్నారo, జొన్నలగడ్డ గూడెం, మాడుగులపల్లి, మంగళపల్లి గ్రామాల్లో జరిగిన శిబిరాలకు జిల్లా పశు వైద్య, పశుసంవర్ధక అధికారి డాక్టర్ జి.వి.రమేశ్ హాజరయ్యారు.

ముమ్మరంగా పశు వైద్య శిబిరాలు.. మేలుజాతి దూడల ప్రదర్శన
ఈ శిబిరాల్లో అనారోగ్యంతో ఉన్న పశువులకు చికిత్సలు, ఎదకు రాని పశువులకు, చూడి నిలవని పశువులకు చికిత్సలు, వేసవిలో పశు పోషణలో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన, మేలు జాతి పశుగ్రాసాల సాగు, దూడలలో నట్టల నివారణ మందులు వాటి ఆవశ్యకత, గొర్రెల యాజమాన్యం, నాటు కోళ్ల పోషణ మొదలగు అంశాలపై రైతులకు అవగాహన కల్పించడం జరిగింది. ఈ శిబిరాలలో 905 పశువులకు గర్భకోశ పరీక్షలు, 1,221 మేలు జాతి దూడల ప్రదర్శన, నట్టల నివారణ మందులు తాగించడం జరిగిందని తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో అన్ని మండలాల పశు వైద్యాధికారులు, పారా వేటర్నరి సిబ్బంది పాల్గొన్నారు.

ముమ్మరంగా పశు వైద్య శిబిరాలు.. మేలుజాతి దూడల ప్రదర్శన
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Congress rule | కాంగ్రెస్ పాలనలో మళ్లీ అయిల్ ఇంజన్లు..! కన్నీళ్లతో సాగు చేస్తున్న రైతన్నలు
Smit Machchhar: పైలట్ స్మిత్ మచ్చర్‌కు ఇజ్రాయెల్ ప్రెసిడెన్షియల్ అవార్డు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
KTR | భారత రాజ్యాంగం కంటే ఎవరూ ఎక్కువ కాదు.. జ్ఞానేష్ కుమార్ తక్షణమే వైదొలగాలి: కేటీఆర్
Thailand Queen: గ్రిపెన్ యుద్ధ విమానాన్ని నడిపిన థాయ్‌ల్యాండ్ క్వీన్… వీడియో
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

