చండూరు అక్టోబర్ 12 : నల్లగొండ జిల్లా చండూరు మండలం పుల్లెంల గ్రామంలోని స్మశానవాటికలో విద్యుత్ స్తంభాలు, విద్యుత్ దీపాలు లేకపోవడంతో గ్రామంలో ఎవరైనా మరణిస్తే వారికి రాత్రి వేళ సమయంలో దహన సంస్కారాలు నిర్వహించడం కష్టంగా మారింది. ఈ సమస్యను కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షులు వడ్డగోని చంద్రశేఖర్ గౌడ్ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది.
వెంటనే ఎమ్మెల్యే స్పందించి విద్యుత్ అధికారులతో మాట్లాడి విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయించారు. పుల్లెంల గ్రామ ప్రజల తరుపున ఎమ్మెల్యే కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షులు వడ్డగోని చంద్రశేఖర్ గౌడ్, మాజీ ఎంపీటీసీ సీత యాదయ్య, రసాల వెంకన్న ,ముక్కముల వెంకన్న, గండు కేశవులు,ఇరిగి వెంకన్న,పాలకూరి బిక్షమయ్య, సీత మల్లయ్య, కనెగోని శంకర్ ,బొడ్డు నరేష్ ,గండు యాదయ్య, నీలకంఠం నరేష్ విద్యుత్ కాంట్రాక్టర్ తదితరులు పాల్గొన్నారు.