నిడమనూరు, డిసెంబర్ 27 : నిడమనూరు మండలంలోని జంగాలవారిగూడెంలో దాతల సహకారంతో పోలీస్ శాఖ ఆధ్వర్యం లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. శనివారం నిడమనూరు ఎస్ఐ ఉప్పు సురేశ్ నూతన సీసీ కెమెరాలను ప్రారంభించి మాట్లాడారు. కెమెరాల ఏర్పాటుతో నేరాలను అదుపు చేయవచ్చన్నారు. శాంతి భద్రతలను పర్యవేక్షించడంతో పటు నేరాలను కట్టడి చేసేందుకు కెమెరాలు దోహదం చేస్తాయన్నారు. కెమెరాల ఏర్పాటుకు ముందుకొచ్చిన సిరిశాల యాదగిరి, ఉప సర్పంచ్ కళ్లెం యాదయ్య, వార్డు సభ్యుడు మోతె ఎల్లయ్య పలువురు గ్రామస్తులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో నర్సింహా , భాస్కర్, సోమయ్య, సహదేవ్, తిరుపతయ్య, లక్ష్మణ్, సుధాకర్ పాల్గొన్నారు.