నీలగిరి, జనవరి 3: పోలీసులు అంకితభావంతో విధులు నిర్వరించి పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకురావాలని ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (పీఅండ్ఎల్) ఎం.రమేశ్ అన్నారు. శుక్రవారం నల్లగొండ జిల్లా కేంద్రంలో సమీపంలోని 12వ బెటాలియన్లో వికారాబాద్, కామారెడ్డి, రామగుండం జిల్లాలకు చెందిన 450 మంది కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ పరేడ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొమ్మిది నెలలపాటు కఠోర శ్రమకు ఓర్చి శిక్షణ పూర్తి చేసుకున్న కానిస్టేబుళ్లను అభినందించారు. నూతన ఉత్సాహంతో ప్రజలకు సమర్ధవంతమైన సేవలు అందించాలని సూచించారు.
పోలీస్ శాఖలో ఉద్యోగం అంటే సవాళ్లతో కూడుకున్నదని, శారీరకంగా, మానసికంకగా దృఢంగా ఉన్పప్పుడే వాటిని ఎదుర్కోగలమన్నారు. కార్యక్రమంలో కమాండెంట్ కె.వీర య్య, ఎస్పీ శరత్ చంద్ర పవార్, అసిస్టెంట్ కమాండెంట్ ఎం.వెంకటేశ్వర్లు, సీహెచ్ ఆంజనేయరెడ్డి, నర్సింగ్ వెంకన్న, అడ్మినిస్టేట్రివ్ అఫీసర్ అతీక్ ఉర్ రెహమాన్, యూని ట్ మెడికల్ ఆఫీసర్ షర్మిలాదేవి, ఆర్ఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. పాసింగ్ అవుట్ పరేడ్లో భాగంగా కానిస్టేబుళ్లు చేసిన కవాతు, కరాటే విన్యాసాలు, సెల్ఫ్ డిఫెన్స్, సెంట్రీ డిఫెన్స్ విన్యాసాలు, బెటాలియన్ బృందం నిర్వహించిన బ్రాండ్ ప్రదర్శన ఆకట్టుకున్నాయి.