చండూరు, ఏప్రిల్ 13 : చండూరు మండలంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను ఎంపీడీఓ బండారు యాదగిరి సోమవారం పరిశీలించారు. మండల పరిధిలోని ధోనిపాముల, నేర్మట గ్రామాలను సందర్శించి ఉపాధి హామీ పని ప్రదేశాలకు వెళ్లి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన కూలీలతో మాట్లాడారు. ఎండగాక ముందే ఉదయం ఏడు గంటలకి పనికి వచ్చి చెప్పిన పనిని తొందరగా ముగించుకుని వెళ్లవలసిందిగా ఆయన కూలీలకు సూచించారు. పని ప్రదేశంలో వారికి కావలసిన కనీస సదుపాయాలు షేడ్ నెట్, మంచినీరు, ఓఆర్ఎస్ పాకెట్లు అందుబాటులో ఉంచాల్సిందిగా సంబంధిత పంచాయితీ కార్యదర్శులను ఆదేశించారు.
అదేవిధంగా నర్సరీలను పరిశీలించి మొలకలు బ్యాగులలో నారు గానీ, అంటూ మొక్కలు గాని పెట్టి వంద శాతం మొలకలు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్, పంచాయతీ కార్యదర్శికి తగు సూచనలు, సలహాలు చేశారు. అనంతరం నేర్మట గ్రామానికి చెందిన నారపాక సైదమ్మ ఇందిరమ్మ ఇంటిని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామల సర్పంచులు, ఉపాధి హామీ ఈసీ, టీఏలు, ఎఫ్ఏలు పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.