నకిరేకల్, అక్టోబర్ 22 : నకిరేకల్ పట్టణంలో మౌలిక సదుపాయాల కల్పన కృషి చేస్తున్నట్లు, ప్రాధాన్యతా క్రమంలో దశల వారీగా పనులను పూర్తి చేయనున్నట్లు ఎమ్మెల్యే వేముల వీరేశం తెలిపారు. బుధవారం పట్టణంలోని 1వ, 8వ, 9వ వార్డుల్లో రూ.1.55 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మిస్తున్న సీసీ&డ్రెన్ నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మున్సిపాలిటీలో దశాల వారీగా డ్రైనేజీ వ్యవస్థను బాగు చేస్తామన్నారు. ఈ నెలలో పట్టణంలో 100 పడకల ఆస్పత్రిని ప్రజలకు అందుబాటులోకి తెస్తామని తెలిపారు. నియోజకవర్గానికి ఐటీ కాలేజీ మంజురూ చేయాల్సిందిగా ఇప్పటికే సీఎంకు విన్నవించినట్లు చెప్పారు. బ్రహ్మాణవెల్లంల, పిల్లాయిపల్లి, ధర్మారెడ్డి కాల్వ ద్వారా చెరువుల్ని నింపుతున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ చెవుగోని రజితా శ్రీనివాస్, వైస్ చైర్మన్ మూరారిశెట్టి ఉమారాణీ కృష్ణమూర్తి, అధికారులు, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.