పెన్పహాడ్, సెప్టెంబర్ 04 : పెన్పహాడ్ మండలం భక్తల్లాపురం గ్రామంలో ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు నెమ్మాది వేంకటేశ్వర్లు అన్నారు. సీపీఎం పోరుబాట కార్యక్రమంలో భాగంగా భక్తల్లాపురం గ్రామంలో గురువారం పర్యటించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ భవనాన్ని పరిశీలించి వెంటనే ప్రహరీ నిర్మించాలన్నారు. డ్రైనేజీ నిర్మించాలన్నారు. అలాగే అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలన్నారు.
గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి రైతులు స్థలం ఇచ్చినప్పటికీ నిర్మించలేక పోయారన్నారు. అర్హులందరికీ పింఛన్లు, రేషన్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సీపీఎం గ్రామ సీనియర్ నాయకుడు నెమ్మాది అడివయ్య, శాఖ కార్యదర్శి ఇరుగు రమేశ్, మండల కమిటి సభ్యులు నెమ్మాది పిరయ్య, గ్రామ పెద్దలు గోపాల్ దాస్, వెంకన్న, మాజీ వార్డు సభ్యుడు నెమ్మాది నర్సయ్య, సోమయ్య, ఇరుగు రాములమ్మ పాల్గొన్నారు.