కేతేపల్లి, జూన్ 13 : మూసీ ప్రాజెక్ట్‌కు ఎగువ ప్రాంతాల నుండి శుక్రవారం 492.24 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగింది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 645 (4.46 టీఎంసీలు) కాగా, ప్రస్తుతం 640.85 (3.41 టీఎంసీలు) అడుగులకు పెరిగింది. గత నెల రోజులుగా ప్రాజెక్ట్ ఎగువ ప్రాంతాలైన హైదరాబాద్, జనగామ, వరంగల్ తదితర ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల వల్ల ఇన్‌ఫ్లో నిలకడగా 400 క్యూసెక్కులకు పైగా వస్తుంది. ఏప్రిల్ నెలలో ప్రాజెక్ట్ కుడి, ఎడమ కాల్వలకు నీటి విడుదల నిలిపి వేసిన సమయం నుండి ఇప్పటి వరకు సుమారు 17 అడుగుల మేర ప్రాజెక్ట్ నీటిమట్టం పెరిగింది. ఇన్‌ఫ్లో ఇదే స్థాయిలో కొనసాగితే ఈ నెల చివరి వరకు నీటిమట్టం 640 అడుగులకు చేరుకునే అవకాశం ఉంది. ప్రాజెక్ట్‌లో నీటిమట్టం పెరుగుతుండటం, వానాకాలం సీజన్ ప్రారంభం కావడంతో అధికారులు కాల్వలకు నీటిని విడుదల చేయాలని రైతులు కోరుతున్నారు.