మునుగోడు, మే 07 : అర్హులైన నిరుపేదలకు రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని సీపీఐ నల్లగొండ జిల్లా కార్యవర్గ సభ్యుడు గురుజ రామచంద్రం అన్నారు. బుధవారం మునుగోడు మండల కేంద్రంలో గల సీపీఐ కార్యాలయంలో జరిగిన మండల కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. సీపీఐ మండల 15వ మహాసభ సింగారం గ్రామంలో అధికారికంగా నిర్వహించేందుకు కార్యవర్గం ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.
ఈ మహాసభలో భవిష్యత్ కార్యక్రమాల అమలు కోసం, పెండింగ్ ప్రాజెక్ట్లు పూర్తి చేయాలని, అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని, ఎలాంటి కొర్రీలు పెట్టకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి చాపల శ్రీను, జిల్లా కౌన్సిల్ సభ్యులు సురిగి చలపతి, బిలాలు, మాజీ జడ్పీటీసీ గోల్కొండ లింగయ్య, కార్యవర్గ సభ్యుడు కాయిత వెంకన్న పాల్గొన్నారు.