చండూరు, జూన్ 07 : ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల్లో అనర్హులను ఏరివేసి, అర్హులకు మాత్రమే ఇండ్లు మంజూరు చేయాలని బీజేపీ నల్లగొండ జిల్లా కార్యదర్శి బొడిగె అశోక్ గౌడ్ అన్నారు. చండూరు మున్సిపల్, మండల శాఖ ఆధ్వర్యంలో స్థానిక ఫంక్షన్ హాల్లో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇండ్లల్లో అర్హులైన పేద ప్రజలకు కాకుండా కాంగ్రెస్ నాయకులు వారి ఇష్టారీతిన అనర్హులకు ఇండ్లు పెట్టిస్తున్నట్లు తెలిపారు. అధికారులు క్షేత్రస్థాయిలో మరలా విచారణ చేసి పేద ప్రజలకు న్యాయం చేయాలని కోరారు. లేనిచో బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో మండల మున్సిపల్ అధ్యక్షుడు ముదిగొండ ఆంజనేయులు, పందుల సత్యం గౌడ్, రాష్ట్ర ఓబీసీ మోర్చా అధికార ప్రతినిధి కోమటి వీరేశం, సింగిల్ విండో డైరెక్టర్ బోడ ఆంజనేయులు, జిల్లా కౌన్సిల్ సభ్యులు నకిరేకంటి లింగస్వామి, భూతరాజు శ్రీహరి, జిల్లా నాయకుడు ఇరిగి ఆంజనేయులు, పార్టీ ప్రధాన కార్యదర్శులు పడసనబోయిన శ్రీను, భూతరాజు స్వామి, సోమ శంకర్, ఆవుల అశోక్ యాదవ్, పార్టీ ఉపాధ్యక్షులు కోమటి ఓంకారం, జెట్టి యాదయ్య, నలపరాజు యాదగిరి, చెనగాని శేఖర్, పల్లెగోని చంద్రమౌళి పాల్గొన్నారు.