కట్టంగూర్, ఏప్రిల్ 23 : అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇస్తామని ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్‌తో కలిసి బుధవారం కట్టంగూర్ మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ఇందిరమ్మ ఇంటి నమూనా నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం పని చేస్తుందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రతి గ్రామానికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని తెలిపారు.
నిరుపేదలకు సొంతింటి కల నెరవేరబోతుందని, ఇళ్ల స్థలం ఉన్న ప్రతి ఒక్కరికి ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం నాలుగు విడుతలుగా రూ.5 లక్షలు ఇస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఓ యారాల అశోక్ రెడ్డి, హౌసింగ్ డీఈ రామకృష్ణారెడ్డి. మండల ప్రత్యేక అధికారి కోటేశ్వర్ రావు, ఎంపీడీఓ పెరుమాళ్ల జ్ఞాన ప్రకాశ్‌రావు, ఎంపీఓ చింతమల్ల చలపతి, మాజీ జడ్పీటీసీలు మాద యాదగిరి, సుంకరబోయిన నర్సింహ్మ, మాజీ ఎంపీపీలు కొండ లింగస్వామి, నాయకులు ఐతగోని నారాయణ, పెద్ది సుక్కయ్య, రెడ్డిపల్లి సాగర్, మాద లింగస్వామి, మిట్టపల్లి శివ, బూరుగు శ్రీను, దార భిక్షం, పెద్ది యాదగి ఐతగోపి నర్సింహ్మ, చౌగోని సాయిలు పాల్గొన్నారు.