నిడమనూరు, జూన్ 23 : అర్హులైన పేదలందరికీ సొంతింటి కలను నిజం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని నల్లగొండ జిల్లా నిడమనూరు వ్యవసాయ మార్కెట్ చైర్మన్ అంకతి సత్యం, కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు యడవల్లి వల్లభ్‌రెడ్డి అన్నారు. నిడమనూరు మండలంలోని బొక్కమంతలపహాడ్, ఊట్కూరు, నందికొండవారిగూడెం, గుంటిపల్లి, బంటువారిగూడెం, వేంపాడు, నారమ్మగూడెం, వడ్డెరిగూడెం, పార్వతీపురం, రాజన్నగూడెం గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఇంటి నిర్మాణ పనులను సోమవారం వారు ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. లబ్ధిదారులు ఇందిరమ్మ పథకాన్ని సద్వినియోగం చేసుకుని సొంతింటి కలను నెరవేర్చుకోవాలన్నారు. అర్హులైన నిరుపేదలందరికీ ప్రభుత్వం పక్కా ఇండ్లు మంజూరు చేస్తుందన్నారు. అనంతరం లబ్ధిదారులకు పక్కా ఇండ్ల మంజూరు ఉత్తర్వులను అందజేశారు. ఈ కార్యక్రమంలో గృహనిర్మాణ ఏఈ మేఘన, నాయకులు ముంగి శివమారయ్య, కొండా శ్రీనివాస్‌రెడ్డి, మాజీ సర్పంచులు నర్సింగ్ విజయ్ కుమార్, నర్సింగ్ కృష్ణయ్య, యడవల్లి నరేందర్‌రెడ్డి, షేక్ జానీపాషా, రూపని కృష్ణ, సిరిషాల యాదగిరి పాల్గొన్నారు.