నల్లగొండ రూరల్, జూలై 28 : ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల్లో లబ్ధిదారులు ప్రభుత్వ నిబంధనలను పాటించాలని నల్లగొండ ఎంపీడీఓ యాకూబ్ నాయక్ అన్నారు. సోమవారం ఆయన మండలంలోని రాములబండలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించి మాట్లాడారు. లబ్ధిదారులంతా ఇంటి నిర్మాణాలు చేపట్టేలా వారికి అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ నిబంధనలకు లోబడే నిర్మాణం చేపట్టాలని అలాకాకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం గ్రామంలోని నర్సరీని, పల్లె ప్రకృతి వనాన్ని ఆయన పరిశీలించారు. ఆయన వెంట ఎంపీఓ ముజీబ్, పంచాయతీ కార్యదర్శి మమత ఉన్నారు.