తుంగతుర్తి, ఆగస్టు 1: ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరుతూ మండల కేంద్రంలోని ఒకే కుటుంబానికి చెందిన గాదంగి శ్రావణి, గాదంగి ఉమారాణి, గాదంగి రేణుక ముగ్గురూ చేతులు జోడించి వేడుకుంటున్న ‘చేతులెత్తి మొక్కుతాం.. ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయండి’ అనే కథనానికి ఎమ్మెల్యే మందుల సామేల్ స్పం దించారు.
శుక్రవారం వారి నివాసానికి వెళ్లి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసే బాధ్యత తనదని హామీ ఇచ్చారు. దీనస్థితిలో ఉన్న వారిని చూసి తక్షణమే ఇల్లు మంజూరు చేయాలని ఎంపీడీవో శేషుకుమార్కు ఆదేశాలు జారీ చేశారు. కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ గుడిపాటి సైదులు, మార్కెట్ కమి టీ వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న, కొండరాజు అజయ్ తదితరులు పాల్గొన్నారు.