రామగిరి, ఆగస్టు 15 : నల్లగొండలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే రమావత్ రవీందర్‌కుమార్ జెండా ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, మాజీ జడ్పీ చైర్మన్ బండ నరేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు నల్లమోతు భాస్కర్‌రావు, చిరుమర్తి లింగయ్య, కంచర్ల భూపాల్‌రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చకిలం అనిల్‌కుమార్, నిరంజన్‌వలీ, మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, మాజీ కార్పొరేషన్ చైర్మన్ కటికం సత్తయ్యగౌడ్, మాజీ ఆర్వో మాలె శరణ్యారెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పంకజ్ యాదవ్, బీఆర్ఎస్ పట్టణ్యాధక్షుడు బోనగిరి దేవేందర్, కౌన్సిలర్లు, పార్టీ ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇటీవల పదవీ విరమణ చేసిన నల్లగొండ మాజీ జడ్పీ చైర్మన్ బండ నరేందర్‌రెడ్డి, మిర్యాలగూడ మాజీ జడ్పీటీసీ తిప్పన విజయసింహారెడ్డి, జిల్లా బీఆర్ఎస్ జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలను సన్మానించి జ్ఞాపికలు అందజేశారు.