కోదాడ, ఆగస్టు 15 : కోదాడ నియోజకవర్గ వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్, స్వచ్ఛంద వర్తక వాణిజ్య సంస్థల ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో నిర్వహించిన ఆటల పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. క్యాంప్ కార్యాలయం, గాంధీ పార్కులో ఎమ్మెల్యే పద్మావతి, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
కోర్టు ఆవరణలో సీనియర్ సివిల్ జడ్జి సురేశ్, మార్కెట్ కమిటీ కార్యాలయంలో చైర్పర్సన్ ఏపూరి తిరుపతమ్మ, మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ రమాదేవి, ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ సూర్యనారాయణ, తాసీల్దార్ కార్యాలయంలో తాసీల్దార్ వహీద్ జాతీయ జెండా ఎగరవేశారు. సత్యమేవ జయతే స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు బాలకృష్ణ ఆధ్వర్యంలో జాతీయ జెండాలు చేబూని బైకులు, ట్రాక్టర్లు, కార్లతో కోదాడ ప్రధాన రహదారిపై భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ వేడుకల్లో ప్రజా ప్రతినిధులు, పలు పార్టీల నాయకులు, స్వచ్ఛంద సంస్థల బాధ్యులు పాల్గొన్నారు.
Kodada : కోదాడలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
Kodada : కోదాడలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు