మునగాల, జనవరి 2 : రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరుతున్నారని కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ అన్నారు. సోమవారం మండలంలోని గణపవరంలో వివిధ పార్టీలకు చెందిన 30 మంది ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అంతకు ముందు దాతల సహకారంతో పింఛన్ లబ్ధిదారుల సౌకర్యార్థం నిర్మించిన భవనం, పల్లె దవాఖానను ప్రారంభించారు.
ఈ సందర్భంగా దాతలు కొండపల్లి వెంకటనర్సింహారావు, కొండపల్లి లక్ష్మీనర్సింహారావులను అభినందించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు. ఎంపీపీ ఎలక బిందు, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు సుంకర అజయ్‌కుమార్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తొగరు రమేశ్, పీఏసీఎస్ చైర్మన్ కందిబండ సత్యనారాయణ, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు వీరంరెడ్డి లింగారెడ్డి, సర్పంచ్ కొండపల్లి విజయ, వెంకట్‌రెడ్డి, నర్సింహారావు పాల్గొన్నారు.