ఉమ్మడి జిల్లావ్యాప్తంగా బీఆర్ పార్టీలోకి పెద్దఎత్తున చేరికలు కొనసాగుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధి, సబ్బండ వర్గాలకు అందుతున్న సంక్షేమ ఫలాలను స్వాగతిస్తూ వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు గులాబీ కండువా కప్పుకొంటున్నారు. శనివారం కట్టంగూర్ చెందిన యువజన కాంగ్రెస్ నాయకులు, కేతేపల్లి కొత్తపేటకు చెందిన వివిధ పార్టీల కార్యకర్తలు ఎమ్మెల్యే చిరుమర్తి సమక్షంలో, సంస్థాన్ మండలం పుట్టపాకకు చెందిన కాంగ్రెస్, బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ సమక్షంలో బీఆర్ చేరారు. గుర్రంపోడు, మాడుగులపల్లికి చెందిన కాంగ్రెస్ కుటుంబాలు ఎమ్మెల్యే నోముల భగత్ సమక్షంలో గులాబీ జెండాకు జై కొట్టాయి.
కేతేపల్లి, సెప్టెంబర్ 23 : రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో దేశ ప్రజల దృష్టి సీఎం కేసీఆర్ వైపు మళ్లిందని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మండలంలోని కొత్తపేటకు చెందిన ఉల్లెందుల యాదగిరి(వీరేశం వర్గం), వివిధ పార్టీల నుంచి పలువురు శనివారం నకిరేకల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ చేరారు. వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో రైతులకు ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతుబీమా, ఆడబిడ్డలకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్, మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికీ తాగునీటిని అందిస్తూ దేశంలోనే ఆదర్శవంతమైన పాలనను సీఎం కేసీఆర్ అందిస్తున్నారని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని చూసి ప్రజలు స్వచ్ఛందంగా బీఆర్ చేరుతున్నట్లు చెప్పారు. దేశ వ్యాప్తంగా సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో నకిరేకల్ బీఆర్ భారీ మెజారిటీతో విజయం సాధించడం ఖాయమన్నారు. పార్టీలో చేరిన వారిలో ఊర వెంకన్న, చందుపట్ల ఏసు, చిరంజీవి, బుడిగ సతీశ్ తదితరులు ఉన్నారు. జడ్పీటీసీ బొప్పని స్వర్ణలత, బీఆర్ మండలాధ్యక్షుడు మారం వెంకట్ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల ప్రదీప్ గ్రామ సర్పంచ్ బచ్చు జానకిరాములు, ఎంపీటీసీ యాదవరెడ్డి పాల్గొన్నారు.
కట్టంగూర్ : మండల కేంద్రానికి చెందిన యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు శనివారం నకిరేకల్ క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సమక్షంలో బీఆర్ చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో అంతటి రామకృష్ణ, యర్కల లక్ష్మణ్, చనగోని రవితేజ, అంతటి శివ, అంతటి శ్రీకాంత్, ఐతగోని శ్రీకాంత్, గట్టిగొర్ల సురేశ్, పల్స తిరుమలేశ్, అంతటి బాలు, పోగుల రాజు ఉన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ జెల్లా ముత్తిలింగయ్య, జడ్పీటీసీ తరాల బలరాములు, బీఆర్ మండలాధ్యక్షుడు ఊట్కూరి ఏడుకొండల్, ప్రధాన కార్యదర్శి సైదిరెడ్డి, గణేశ్ పాల్గొన్నారు.