నిడమనూరు, డిసెంబర్ 20 : గ్రామీణ ప్రాంతాలకు రవాణా సదుపాయాలు మెరుగు పరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం రోడ్ల నిర్మాణానికి అధిక నిధులు కేటాయిస్తున్నదని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్‌కుమార్ అన్నారు. మండలంలోని గుంటుకగూడెంలో సీడీపీ నిధులు రూ.20 లక్షలతో నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులకు మంగళవారం శంఖుస్థాపన చేశారు. బొక్కమంతలపహాడ్‌లో రూ.20 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉప ఎన్నిక సందర్భంగా సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు గ్రామాల్లో అతంర్గత రోడ్ల నిర్మాణానికి నిధులు విడుదల చేశారన్నారు.
సీఎం కేసీఆర్ చొరవతోనే గ్రామాల రూపురేఖలు మారాయన్నారు. గత పాలకులు పల్లెల బాగోగులు పట్టించుకోలేదన్నారు. సీఎం కేసీఆర్ పల్లెల ఆర్థిక ప్రగతికి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ బొల్లం జయమ్మ, జడ్పీటీసీ నందికొండ రామేశ్వరి, పంచాయతీరాజ్ ఏఈ. వరలక్ష్మి, బీఆర్ఎస్ జిల్లా నాయకులు చేకూరి హనుమంతరావు, మండలాధ్యక్షుడు తాటి సత్యపాల్, ఎంపీపీ సలహాదారుడు బొల్లం రవియాదవ్, సర్పంచులు అక్కి సరితాశ్రీను, పిల్లి రమేశ్‌యాదవ్, కేశ శంకర్, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు పెదమాం యాదయ్య, టీఆర్ఎస్ మండల అధికార ప్రతినిధి లకుమాల మధుబాబు, ముప్పారం దేవస్థాన కమిటీ చైర్మన్లు మేరెడ్డి వెంకటరమణ, దరీబు లింగప్ప, పార్టీ మండల ప్రధాన కార్యదర్శి నల్లబోతు వెంకటేశ్వర్లు, నాయకులు గండికోట యాదగిరి, భాస్కర్ నారాయణ, అన్నెబోయిన కొండల్, ఆలంపల్లి నరేశ్, వార్డు సభ్యులు శంకరయ్య, మారయ్య, నాగరాజు, ప్రవీణ్ పాల్గొన్నారు.
హాలియా : ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మాలే సత్యనారాయణరెడ్డిని మంగళవారం ఎమ్మెల్యే నోముల భగత్‌కుమార్ నల్లగొండలో పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.