Pensions | వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా పింఛన్లు పెంచకపోతే సెప్టెంబర్లో భారీ ఉద్యమం నిర్వహిస్తామని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు, పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ప్రభుత్వాన్ని తీవ్రస్థాయిలో హెచ్చరించారు. ఆదివారం కోదాడ ఆర్ఎస్వీ ఫంక్షన్లో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. వృద్ధులకు, వితంతువులకు ఒంటరి మహిళలకు రూ.4000, వికలాంగులకు రూ.6000 పెన్షన్లు తక్షణమే మంజూరు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రజాక్షేత్రంలో నిలదీస్తామన్నారు. సెప్టెంబర్ నెలలో లక్షలాదిమంది వృద్దులు, వితంతువులు, వికలాంగులు ఒంటరి మహిళలతో హైదరాబాద్లో భారీ సభ నిర్వహిస్తామని.. ప్రభుత్వానికి తమ సత్తా ఏందో నిరూపిస్తామన్నారు.. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల్లో అమలు కాని వాగ్దానాలను ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిందని విమర్శించారు.
తక్షణమే ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే పతనం ఖాయమన్నారు. ఈ సమావేశంలో ఎమ్మార్పీఎస్ అనుబంధ సంఘాల నాయకులు బచ్చలకూరి వెంకటేశ్వర్లు, రుద్ర సురేష్ కర్ల, విజయరావు, పులి నాగేశ్వరరావు, ఏపూరి రాజు, కొండపల్లి ఆంజనేయులు, సత్యరాజు, వెంకన్న, కుటుంబరావు, వృద్ధులు, వితంతువులు, వికలాంగులు పాల్గొన్నారు.
Ear Wax Cleaning | చెవుల్లో ఉండే గులిమిని తొలగించేందుకు ఈ సహజసిద్ధమైన చిట్కాలను పాటించండి..!
Rahul portrait burnt | కాంగ్రెస్ ఆటలు సాగడం లేదని అపనిందలు.. రాహూల్ గాంధీ చిత్రపటం దహనం
Free mega medical camp | కోటగిరి లో ఉచిత మెగా వైద్య శిబిరం.. ప్రజల నుంచి విశేష స్పందన