మూసీ లోతట్టు ప్రజలను అప్రమత్తం చేయాలి
ఎగువన వర్షాలు పడుతున్నందున మూసీ లోతట్టు ప్రాంతాల ప్రజలకు అవగాహన కల్పించి అప్రమత్తం చేయాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
- ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యాబోధన అందించాలి
- సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్
సూర్యాపేట రూరల్, జూలై 20 : ఎగువన వర్షాలు పడుతున్నందున మూసీ లోతట్టు ప్రాంతాల ప్రజలకు అవగాహన కల్పించి అప్రమత్తం చేయాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మండలంలోని మూసీ ప్రాజెక్టును శనివారం ఆయన సందర్శించి నీటి నిల్వలు, సామర్థ్యాన్ని పరిశీలించారు. గేట్ల పనితీరు, తదితర అంశాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వర్షాలు కురుస్తున్నందున ఇరిగేషన్, రెవెన్యూ, పంచాయతీరాజ్, పోలీస్ శాఖల అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. అనంతరం టేకుమట్ల గ్రామంలో జడ్పీహెచ్ఎస్, ప్రైమరీ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి భోజనం, ఆహార పదార్థాలను పరిశీలించారు.
విద్యార్థులకు మెనూ ప్రకారం మంచి ఆహారంతోపాటు నాణ్యమైన విద్యా బోధన అందించాలని, అధ్యాపకులు విధుల పట్ల నిబద్ధతతో ఉండాలని సూచించారు. వర్షాకాలంలో ఎప్పటికప్పుడు పారిశుధ్య పనులు చేపట్టాలని, పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలను పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఆయన వెంట తాసీల్దార్ శ్యామ్‌సుందర్‌రెడ్డి, ఇరిగేషన్ డీఈ వేణుగోపాల్, ఏఈ ఉదమ్కుమార్ ఉన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
కొలనూరులో వీధి కుక్కల స్వైరవిహారం.. దూడ మృతి
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

