Venu Udugula | రాప్తాడు ఘటనపై దర్శకుడు వేణు ఊడుగుల ఆవేదన.. ‘అమ్మాయి కాదంటే వెంటపడటమే హీరోయిజమా?’
Venu Udugula | అనంతపురం జిల్లా రాప్తాడులోని ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థినిపై జరిగిన దాడి తీవ్ర కలకలం రేపుతోంది. తరగతి గదిలోకి చొరబడిన ఓ యువకుడు పవర్ చైన్సాతో బాలికపై దాడి చేయడంతో ఆమె ముఖం, తల, వీపు భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన మరో విద్యార్థిని కూడా గాయపడింది.
Venu Udugula | అనంతపురం జిల్లా రాప్తాడులోని ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థినిపై జరిగిన దాడి తీవ్ర కలకలం రేపుతోంది. తరగతి గదిలోకి చొరబడిన ఓ యువకుడు పవర్ చైన్సాతో బాలికపై దాడి చేయడంతో ఆమె ముఖం, తల, వీపు భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన మరో విద్యార్థిని కూడా గాయపడింది. తీవ్రంగా గాయపడిన బాలికను తొలుత అనంతపురం సర్వజన ఆస్పత్రికి తరలించారు. వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం అక్కడి నుంచి బెంగళూరుకు తీసుకెళ్లారు. ఈ ఘటనపై పలువురు ఆందోళన వ్యక్తం చేస్తుండగా, టాలీవుడ్ దర్శకుడు వేణు ఊడుగుల కూడా స్పందించారు.
ఈ ఘటనలో బాలిక మరణించిందంటూ ఓ నెటిజన్ సామాజిక మాధ్యమంలో చేసిన పోస్టును వేణు ఊడుగుల తొలుత పంచుకున్నారు. 14 ఏళ్ల వయసులో ప్రపంచాన్ని అర్థం చేసుకుంటూ, భవిష్యత్తు గురించి కలలు కనాల్సిన బాలికపై తిరస్కరణను తట్టుకోలేని ఓ యువకుడు దాడి చేయడం అత్యంత విషాదకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఎదుటివారు తమ ఇష్టానికి అనుగుణంగా జీవించాలనే ఆధిపత్య భావజాలమే ఇలాంటి దారుణాలకు కారణమని వ్యాఖ్యానించారు. అయితే బాలిక మరణించలేదని, తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతోందని మరో నెటిజన్ ఆయనకు తెలియజేశారు. ప్రభుత్వం కూడా ఆమె మరణించినట్లు వచ్చిన వార్తలను ఖండించిందని పేర్కొన్నారు. దీంతో స్పందించిన వేణు ఊడుగుల.. బాలిక బతికే ఉందని తెలిసి సంతోషంగా ఉందని, ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. అప్పటికి వచ్చిన వార్తల ఆధారంగానే తాను పోస్టు చేసినట్లు స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా ఓ నెటిజన్ వేణు ఊడుగుల దర్శకత్వంలో వచ్చిన ‘విరాటపర్వం’ సినిమాను ప్రస్తావించారు. ప్రేమను ఆరాధనగా చూపించిన దర్శకుడిగా, అమ్మాయి తిరస్కరించినా వెంటపడటమే హీరోయిజం అనే భావనను సినిమాలు ఎంతవరకు ప్రోత్సహిస్తున్నాయని ప్రశ్నించారు. ‘కాదు’ అనే మాటను గౌరవించడం మన సినిమాలు ప్రేక్షకులకు నేర్పిస్తున్నాయా? అని నిలదీశారు. దీనికి వేణు ఊడుగుల సూటిగా సమాధానమిచ్చారు. ఒక నేరం జరిగినప్పుడు దానికి సినిమా మాత్రమే కారణమని నిందిస్తే, చర్చ నేరస్థుడి క్రూరత్వం నుంచి పక్కదారి పడుతుందని పేర్కొన్నారు. చేసిన నేరానికి పూర్తి బాధ్యత నేరస్థుడిదేనని స్పష్టం చేశారు. అయితే అమ్మాయి వెంటపడటాన్ని ప్రేమగా, ఆమె తిరస్కరించినా వెంటపడటాన్ని హీరోయిజంగా చూపించే సినిమాలు అలాంటి ప్రవర్తనను సమాజంలో సాధారణంగా అంగీకరించేలా చేశాయని అభిప్రాయపడ్డారు.
సినిమాల ప్రభావాన్ని పూర్తిగా కొట్టిపారేయలేమని, కోట్లాది మందికి చేరే చిత్రాలకు సామాజిక బాధ్యత తప్పనిసరిగా ఉంటుందని వేణు ఊడుగుల పేర్కొన్నారు. రాప్తాడు ఘటన నేపథ్యంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఒకవైపు బాలిక త్వరగా కోలుకోవాలని పలువురు ఆకాంక్షిస్తుండగా, మరోవైపు మహిళల ఇష్టాన్ని, తిరస్కరణను గౌరవించే సంస్కృతిని పెంపొందించాల్సిన అవసరంపై చర్చ జరుగుతోంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Venu Udugula | రాప్తాడు ఘటనపై దర్శకుడు వేణు ఊడుగుల ఆవేదన.. ‘అమ్మాయి కాదంటే వెంటపడటమే హీరోయిజమా?’
Janhvi Kapoor | శ్రీదేవి ఐకానిక్ ‘నాగిని’ లుక్‌ను రీక్రియేట్ చేసిన జాన్వీ కపూర్.. హలోవీన్ పార్టీలో స్పెషల్ అట్రాక్షన్!
Telugu University | ఏపీ ఎమ్మెల్యేకు తెలంగాణ పురస్కారం..! వివాదాస్పదంగా మారిన తెలుగు యూనివర్సిటీ నిర్ణయం
Symbols were tampered | ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో గుర్తులు తారుమారు..! నిలిచిన పోలింగ్
Hrithik Roshan | మన బంధం ఒక్క సినిమాతో ముగియలేదు.. దర్శకుడు సంజయ్ గుప్తా మృతిపై హృతిక్ ఎమోషనల్!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

