Radhika Apte | ఇన్నర్స్ లేకుండా యాక్షన్ సీన్ చేయాలన్నారు.. రెండు వారాలు వేధించారు: రాధికా ఆప్టే
Radhika Apte | నటి రాధికా ఆప్టే మరోసారి తనకు ఎదురైన చేదు అనుభవాన్ని బయటపెట్టారు. సినిమా సెట్స్‌లో మహిళా నటీమణులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. తన తాజా వెబ్‌సిరీస్ ‘అక్క’ ప్రమోషన్లలో పాల్గొన్న రాధికా.. గతంలో ఓ సినిమా షూటింగ్ సమయంలో దర్శకుడు, చిత్రబృందం తనను ఇబ్బందికరమైన డిమాండ్లతో వేధించారని వెల్లడించారు.
Radhika Apte | నటి రాధికా ఆప్టే మరోసారి తనకు ఎదురైన చేదు అనుభవాన్ని బయటపెట్టారు. సినిమా సెట్స్‌లో మహిళా నటీమణులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. తన తాజా వెబ్‌సిరీస్ ‘అక్క’ ప్రమోషన్లలో పాల్గొన్న రాధికా.. గతంలో ఓ సినిమా షూటింగ్ సమయంలో దర్శకుడు, చిత్రబృందం తనను ఇబ్బందికరమైన డిమాండ్లతో వేధించారని వెల్లడించారు. బ్రా లేకుండా, షర్ట్ బటన్లు విప్పి యాక్షన్ సీన్లో నటించాలని అడిగారని తెలిపారు. ఓ సినిమా షూటింగ్లో యాక్షన్ సీన్ చిత్రీకరణకు రెండు రోజుల ముందు దర్శకుడు, ఆయన బృందం తన దగ్గరకు వచ్చారని రాధికా ఆప్టే చెప్పారు. బ్రా లేకుండా కేవలం షర్ట్ వేసుకుని, బటన్లు విప్పి ఫైట్ సీన్ చేయగలరా? అని నేరుగా అడిగారని వెల్లడించారు.
వారి మాటలు విని ఆశ్చర్యపోయానని, యాక్షన్ సీన్లో శరీరం కదిలినప్పుడు షర్ట్ పక్కకు జరిగే అవకాశం ఉంటుందని, కనీస లాజిక్ ఆలోచించరా? అని ఎదురు ప్రశ్నించినట్లు తెలిపారు. దానికి వారు మరో అడుగు ముందుకేసి కేవలం బ్రా, అండర్‌వేర్‌తోనే ఆ సన్నివేశం చేయవచ్చుకదా అని అడిగారని చెప్పారు. అసలు తనతో ఏం చేయించాలని అనుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు వివరించారు. సినిమా కథ చెప్పినప్పుడు, ఒప్పందం చేసుకున్నప్పుడు ఇలాంటి సన్నివేశాల గురించి ఎలాంటి సమాచారం ఇవ్వలేదని రాధికా ఆప్టే పేర్కొన్నారు. ఒకవేళ నగ్నత్వం లేదా శరీర ప్రదర్శనకు సంబంధించిన సన్నివేశాలు అవసరమైతే ముందుగానే స్పష్టంగా చెప్పాలని అభిప్రాయపడ్డారు.
షూటింగ్ సమయానికి వచ్చి ఎంతవరకు చూపించాలి? ఏం చూపించాలి? అంటూ పదేపదే చర్చలు జరుపుతూ దాదాపు రెండు వారాల పాటు తనను ఇబ్బంది పెట్టారని వెల్లడించారు. ఈ పరిణామాల వల్ల తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యానని తన అనుభవాన్ని పంచుకున్నారు. సినిమాల్లో రొమాంటిక్, సన్నిహిత సన్నివేశాల చిత్రీకరణ సమయంలో నటీనటుల అంగీకారం, సౌకర్యం, భద్రతను పర్యవేక్షించేందుకు సాన్నిహిత్య సమన్వయకర్తలు ఉంటారు. అయితే వారి పరిస్థితి కూడా పరిశ్రమలో అంత సులభంగా లేదని రాధికా అన్నారు. నిర్మాతలు చెప్పినట్లే వారు కూడా వ్యవహరించాల్సి వస్తోందని, నటీమణులకు మద్దతుగా మాట్లాడితే కొందరు నిర్మాతలు వారిని ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నారని ఆరోపించారు. పరిశ్రమలో అందరూ ఇలాగే ఉంటారని తాను చెప్పడం లేదని, కానీ కొందరు చేసే అనుచిత ప్రవర్తన వల్ల సినిమా సెట్స్‌లో నటీమణులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Radhika Apte | ఇన్నర్స్ లేకుండా యాక్షన్ సీన్ చేయాలన్నారు.. రెండు వారాలు వేధించారు: రాధికా ఆప్టే
Venu Udugula | రాప్తాడు ఘటనపై దర్శకుడు వేణు ఊడుగుల ఆవేదన.. ‘అమ్మాయి కాదంటే వెంటపడటమే హీరోయిజమా?’
Janhvi Kapoor | శ్రీదేవి ఐకానిక్ ‘నాగిని’ లుక్‌ను రీక్రియేట్ చేసిన జాన్వీ కపూర్.. హలోవీన్ పార్టీలో స్పెషల్ అట్రాక్షన్!
Telugu University | ఏపీ ఎమ్మెల్యేకు తెలంగాణ పురస్కారం..! వివాదాస్పదంగా మారిన తెలుగు యూనివర్సిటీ నిర్ణయం
Symbols were tampered | ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో గుర్తులు తారుమారు..! నిలిచిన పోలింగ్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

