Suriya – Jyothika | అన్న వదిన ప్రేమించుకుంటే మాకు తిట్లు పడుతున్నాయి.. సూర్య-జ్యోతిక జంటపై కార్తీ సెటైర్లు!
Karthi | కోలీవుడ్ స్టార్ కపుల్ సూర్య మరియు జ్యోతిక ఇటీవల స్కాట్లాండ్లో తమ వివాహ వార్షికోత్సవం సందర్భంగా మరోసారి పెళ్లి చేసుకుని తమ ప్రేమను చాటుకున్న సంగతి తెలిసిందే.
Karthi |కోలీవుడ్ స్టార్ కపుల్ సూర్య మరియు జ్యోతిక ఇటీవల స్కాట్లాండ్లో తమ వివాహ వార్షికోత్సవం సందర్భంగా మరోసారి పెళ్లి చేసుకుని తమ ప్రేమను చాటుకున్న సంగతి తెలిసిందే. అయితే వీరిద్దరి అన్యోన్యతను చూసి సూర్య తమ్ముడు, ప్రముఖ నటుడు కార్తీ చేసిన సరదా వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
సూర్య నటించిన సీన్ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు అతిథిగా వచ్చిన కార్తీ సూర్య, జ్యోతికల రిలేషన్షిప్ గురించి మాట్లాడుతూ.. వాళ్లిద్దరి మధ్య ప్రేమ ఓవర్ అయిపోయిందని, అక్కడకు వెళ్లిన మిగతా జంటలందరికీ అది నిజంగా ఇది న్యాయమేనా అనిపించిందని పేర్కొన్నారు. వాళ్లకు జరిగిన పెళ్లి అనంతరం తనకు జరిగిన తిట్లు గురించి నేనైతే అసలు చెప్పలేనని, ఇదంతా చూశాక చాలా మంది భార్యాభర్తలు తమ ఇంటికి వెళ్లగానే.. ‘చూశారా వాళ్లు ఎలా ప్రేమించుకుంటున్నారో.. మీరేమో ఇలా ఉన్నారు’ అంటూ భార్యలు తమ మొగుళ్లపై విరుచుకుపడుతున్నారని, ఈ విషయంలో తాను కూడా బాగానే తిట్లు తిన్నానని కార్తీ సరదాగా చెప్పి నవ్వులు పూయించారు. ఏదేమైనా ఆ వేడుక చాలా బ్యూటిఫుల్‌గా అనిపించిందని ఆయన తెలిపారు. సూర్య – జ్యోతికల అన్యోన్యతను, వారి మధ్య ఉన్న గాఢమైన ప్రేమను కార్తీ తనదైన శైలిలో ఫన్నీగా వర్ణించిన తీరు అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
#Karthi about #Suriya and #Jyothika’s Recent Vow Renewal Ceremony 😃:
“Avanga Rendu Per Love Over ah iruku..😄 Anga vandhrundha matha couples ku lam Dharma adi.. I cannot tell the bashing i got.. Lot of people are not getting food at home after watching this saying, “Epdi love pandranga paaru.. Neeyum irukiye..” But it was beautiful..”❣️ https://t.co/AfRBhMBzKa
— Laxmi Kanth (@iammoviebuff007) October 31, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Suriya – Jyothika | అన్న వదిన ప్రేమించుకుంటే మాకు తిట్లు పడుతున్నాయి.. సూర్య-జ్యోతిక జంటపై కార్తీ సెటైర్లు!
Radhika Apte | ఇన్నర్స్ లేకుండా యాక్షన్ సీన్ చేయాలన్నారు.. రెండు వారాలు వేధించారు: రాధికా ఆప్టే
Venu Udugula | రాప్తాడు ఘటనపై దర్శకుడు వేణు ఊడుగుల ఆవేదన.. ‘అమ్మాయి కాదంటే వెంటపడటమే హీరోయిజమా?’
Janhvi Kapoor | శ్రీదేవి ఐకానిక్ ‘నాగిని’ లుక్‌ను రీక్రియేట్ చేసిన జాన్వీ కపూర్.. హలోవీన్ పార్టీలో స్పెషల్ అట్రాక్షన్!
Telugu University | ఏపీ ఎమ్మెల్యేకు తెలంగాణ పురస్కారం..! వివాదాస్పదంగా మారిన తెలుగు యూనివర్సిటీ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

