మనస్పర్థలు వీడి న్యాయమూర్తుల సమక్షంలో ఒక్కటైన భార్యాభర్తలు
శనివారం జరగనున్న జాతీయ మెగా లోక్ అదాలత్‌లో ముందస్తుగా శుక్రవారం రోజు న్యాయమూర్తుల ఎదుట ఒక జంట తమ పిల్లలతో సహా ఒక్కటయ్యారు. సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం బోజ్యతండాకు చెందిన భూక్య కవితకు ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం..
హుజూర్నగర్, జూన్ 19 : శనివారం జరగనున్న జాతీయ మెగా లోక్ అదాలత్‌లో ముందస్తుగా శుక్రవారం రోజు న్యాయమూర్తుల ఎదుట ఒక జంట తమ పిల్లలతో సహా ఒక్కటయ్యారు. సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం బోజ్యతండాకు చెందిన భూక్య కవితకు ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం జయంతిపురానికి చెందిన భూక్య లక్ష్మీనరసింహతో 2019లో వివాహం జరిగింది. వారికి శరణ్య, శ్రీకర్ నాయక్ జన్మించారు. 05 సంవత్సరాల పాటు సజావుగా సాగిన వీరి కాపురం తదుపరి ఇద్దరి మధ్య మనస్పర్ధలు తలెత్తి విడిపోయారు. గత రెండు సంవత్సరాలుగా వీరిరువురు విడివిడిగా జీవిస్తున్నారు. తనకు విడి కాగితాలు మంజూరు చేయమని కోరుతూ లక్ష్మీనరసింహ సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో విడాకుల కేసు కవితపై దాఖలు చేశాడు. కేసు విచారణలో ఉన్నది.
ఇంతలో లోక్ అదాలత్ రావడంతో రెండవ అదనపు జిల్లా న్యాయమూర్తి శివరామ ప్రసాద్, సీనియర్ సివిల్ జడ్జి నక్కా శ్యాంసుందర్, అదనపు జూనియర్ సివిల్ జడ్జి ఆయేషా సరీన్ చొరవ తీసుకుని దంపతులు ఇరువురితో ముఖాముఖి మాట్లాడి వారికి నచ్చజెప్పగా వారు ఇరువురు తిరిగి కలిసి సంసారం కొనసాగించడానికి అంగీకరించి వారి పిల్లల యుక్తముగా నేడు కేసును రాజీ చేసుకుని కలిసిపోయారు. ఈ సందర్భంగా న్యాయమూర్తులు వారి చేత ఒకరి చేత ఒకరికి పూలదండలు మార్పించి శుభాకాంక్షలు తెలిపి జంటను కలిపారు. వారి ఇద్దరి మధ్య రాజీ కుదర్చడానికి వారి వారి న్యాయవాదులు బానోతు సురేష్ కుమార్, కొణతం శ్రీనివాస రెడ్డి తమ సహాయాన్ని అందించారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Help Desk | పట్టభద్రుల ఎన్రోల్మెంట్ హెల్ప్‌డెస్క్ ప్రారంభం
‘ఉపాధి కోసం వ్యక్తిగత రుణాలను సద్వినియోగం చేసుకోవాలి’
Bronze Medal | రాష్ట్రస్థాయి రెజ్లింగ్ పోటీల్లో శ్రీవల్లికి కాంస్య పతకం
Belraj Kalarickal | తొలి వెబ్‌సిరీస్ విడుదలైన తెల్లారే గుండెపోటుతో యువ దర్శకుడు మృతి..!
Will Sit On Dharna | ‘అక్కడ కూర్చొని ధర్నా చేస్తాం’.. ఢిల్లీ హైకోర్టు సమీపంలో రోడ్డు పనుల్లో జాప్యంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

