నీలగిరి, జూలై 22: ‘కృష్ణానది పరీవాహకం లో చేపల వ్యాపారం కోసం ఇతర ప్రాం తాల నుంచి వ్యక్తులను అక్రమ రవాణా చేస్తున్న ఎనిమిది మందితో కూడిన ముఠా ను అరెస్టు చేశాం. వెట్టిచాకిరీ చేస్తున్న 36 మందికి విముక్తి కల్పించి వెంటనే వారి సొంత ప్రాంతాలకు తరలించాం’అని జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ తెలిపారు. బాలల పరిరక్షణ కమిటీ, కార్మిక శాఖ అధికారుల తో కలిసి మంగళవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘పోలీసులు, రెవెన్యూ, చైల్డ్ వెల్ఫేర్, ఇతర అధికారుల సమన్వయంతో బృందాలుగా ఏర్పడి నది పరీవాహక ప్రాంతంలో రెస్క్యూ చేసి వెట్టిచాకిరీ చేయిస్తున్న వ్యక్తుల చెరనుంచి 32 కార్మికులు, నలుగురు బాలకార్మికులు మొత్తం 36 మంది బాధితులను విముక్తులను చేశాం’ అని చెప్పారు.
వీరితో వెట్టిచాకిరీ చేయించుకుంటున్న నిందితులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ‘పీఏ పల్లి మండలం బనాలకుంట గ్రామానికి చెందిన వడ్త్య జవాహర్ లాల్, పాయతండాకు చెందిన రమావత్ రమేశ్, ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లికి చెదిన మైలపల్లి శివ, కారే సిం హాచలం, వంక విశాఖ అలియాస్ ఇషాక్, నేరేడుగొమ్ము మండలం వైజాక్ కాలనీకి చెందిన ఎరిపల్లి బాబుజీ అలియాస్ బావొ జీ, చాపల తాతారావు, చాపల బంగారిలు నాగార్జున సాగర్‌లో చేపల వ్యాపారం చేస్తున్నారు.
జవహర్ లాల్, రమేశ్, శివ హైదరాబాద్‌కు చెందిన రాజు, జగన్ విజయవాడ కు చెందిన వెంకన్న, లోకేశ్‌లను ఏజెంట్లుగా నియమించుకున్నారు. వీరు ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, బిహార్, ఒడిషా రాష్ట్రాల నుంచి హైదరాబాద్, విజయవాడ లాంటి ప్రాంతాలకు వలస వచ్చిన వారిని టార్గెట్‌గా చేసుకొని ఉపాధి కల్పిస్తామని నెలకు రూ.15 వేల జీతం, రోజుకు కేవలం 2 గంటల పని, ఉచిత ఆహారంతోపాటు మద్యం ఇస్తామని మాయమాటలు చెప్పి ఇక్కడకు తీసుకొస్తున్నారు.
విజయవాడ, హైదరాబాద్ నుంచి దేవరకొండలోని మల్లేపల్లికి పంపుతున్నారు. మల్లేపల్లిలో వీరికి ఇక్కడున్న చేపల వ్యాపారులు వారి సెల్ఫోన్లను తీసుకొని రాత్రి సమయంలో ద్విచక్ర వాహనాలపై బాణాలకుంట, వైజాక్కాలనీలోకి పంపిస్తున్నారు. ఎలాంటి సదుపాయా లు లేని ఐలాండ్‌లో కేవలం ప్లాస్టిక్ కవర్ ఇచ్చి చేపలు పట్టాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు. చుట్టూ నీరు ఉండడంతో వారు తప్పించుకునే అవకాశం లేదు. ప్రతిరోజు వారితో చేపలు పట్టడం, చేపల వలలు లాగ డం లాంటి పనులకు వినియోగిస్తున్నారు. కేవలం రెండు పూటలు మాత్రమే భోజనం అందిస్తున్నారు.
పని భారం ఎకువైందని, పనికి డబ్బులు ఇవ్వాలని కోరితే చిత్రహింసలు పెడుతున్నారని చెప్పారు. ఏజెంట్లుగా ఉన్న రాజు, జగన్, లోకేశ్, వెంకన్న పరారీలో ఉన్నారని, త్వరలో వారిని అదుపులోకి తీసుకుంటామని చెప్పారు. సమావేశంలో దేవరకొండ ఏఎస్పీ మౌనిక, కార్మిక శాఖ అధికారి అరుణకుమారి, సీడబ్ల్యూసీ చైర్మన్ చింతకృష్ణ, బాలల పరిరక్షణ అధికారి కేసాని గణేశ్‌గౌడ్, సీఐలు నవీన్, బీసన్న ఎస్ఐలు దొరెపల్లి నర్సింహులు, నాగేంద్రబాబు, సిబ్బంది మహేశ్, రాజు, ప్రశాంత్, నరేందర్ రెడ్డి ఉన్నారు.