నల్లగొండ : వరంగల్- ఖమ్మం -నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్(MLC elections) కార్యక్రమం జోరుగా కొనసాగుతున్నది. గత నాలుగు రోజుల్లో ఆరుగురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా ఇవాళ పలువురు అభ్యర్థులు తరలివస్తున్నారు. శుక్రవారం యూటీఎఫ్ అభ్యర్థి ప్రస్తుత ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి నామినేషన్ దాఖలు చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా నల్లగొండ (Nalgonda) క్లాక్ టవర్ సెంటర్ నుంచి పెద్ద ఎత్తున ఉపాధ్యాయ అధ్యాపకుల ఆధ్వర్యంలో భారీ ర్యాలీని చేపట్టారు.
మధ్యాహ్నం ఒంటిగంటకు నర్సిరెడ్డి తన నామినేషన్ పత్రాన్ని దాఖలు చేయనున్నారు. అనంతరం సభను కూడా నిర్వహించనున్నారు. కాగా, రేపు, ఎల్లుండి ప్రభుత్వ సెలవు దినాలు కావడంతో నామినేషన్లకు చివరి రోజు సోమవారం నాడు ప్రధాన సంఘాల అభ్యర్థులతో పాటు పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు కానున్నాయి.