మిర్యాలగూడ, డిసెంబర్ 22 : ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో హెచ్ఆర్ విధానాన్ని అమలు చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు అన్నారు. పీఏసీఎస్ ఉద్యోగులకు హెచ్ఆర్ పాలసీ జీఓ నంబర్ 44 అమలు చేసినందుకు కృతజ్ఞతగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం పీఏసీఎస్ ఉద్యోగుల ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పీఏసీఎస్‌ల బలోపేతానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని, దాంతో రైతులకు మెరుగైన సేవలు అందుతున్నాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భాస్కర్‌రావు, మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్‌ను పీఏసీఎస్ ఉద్యోగులు, సిబ్బంది సన్మానినంచారు. కార్యక్రమంలో పడగపాటి కోటిరెడ్డి, జేరిపోతుల రాములుగౌడ్, లచ్చయ్య, వెంకట్‌రెడ్డి, నర్సయ్య, యాదగిరి, సైదులు, క్రాంతి, శేఖర్, సతీశ్, శ్రీను, నరేశ్, వెంకన్న, ప్రవీణ్, సుధాకర్, సురేశ్ పాల్గొన్నారు.
త్రిపురారంలో..
త్రిపురారం : మండల కేంద్రంలోని కో ఆపరేటివ్ సొసైటీ ఆవరణలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఫ్లెక్సీకి పీఏసీఎస్ ఉద్యోగులు క్షీరాభిషేకం చేశారు. దేశంలో తొలిసారిగా పీఏసీఎస్ సంఘాల్లో సమగ్ర నూతన మానవ వనరుల విధానాన్ని అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కిందని త్రిపురారం, బాబుసాయిపేట, పెద్దదేవులపల్లి సీఈఓలు అన్నారు. కార్యక్రమంలో సీఈఓలు ఉపేందర్, నర్సయ్య, గోవర్ధన్, కరుణాకర్, వెంకట్రామిరెడ్డి, సైదులు, విష్ణు, శంకర్, మధు, సోమయ్య, సతీశ్ పాల్గొన్నారు.
కట్టంగూరులో..
కట్టంగూర్ : కట్టంగూర్ డీసీసీబీ బ్యాంక్ ఎదుట సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ నూక సైదులు, బ్రాంచ్ మేనేజర్ దీప్తి, యూనియన్ జనరల్ సెక్రటరీ ఆంజనేయులు, సీఈఓ బండ మల్లారెడ్డి, సిబ్బంది చెరుకు చంద్రయ్య, సైదులు, రాంబాబు, సైదమ్మ పాల్గొన్నారు.
నకిరేకల్‌లో..
నకిరేకల్ : పట్టణంలోని డీసీసీబీ బ్రాంచి వద్ద సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ పల్రెడ్డి మహేందర్‌రెడ్డి, వైస్ చైర్మన్ నాగులవంచ వెంకటేశ్వర్రావు, డైరెక్టర్లు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.