Munugode Market Yard | మునుగోడు, అక్టోబర్ 29 : రైతులకు ఉపయోగపడాల్సిన మునుగోడు మార్కెట్ యార్డ్ నిబంధనలకు విరుద్ధంగా దళారి వ్యాపారులకు అడ్డాగా మారిందని రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు బండ శ్రీశైలం ఆరోపించారు. బుధవారం మునుగోడు మండల కేంద్రంలోని అమరవీరుల స్మారక భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నిబంధనలకు విరుద్ధంగా దళారులకు కొమ్ముకాసే విధంగా దళారి వ్యాపారులకు మార్కెట్ యార్డును లీజుకి ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు..?
నిబంధనలను ఉల్లంఘించి దళారులకు లీజుకు ఇచ్చిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చే సమయంలో కురుస్తున్న అకాల వర్షాలకు పత్తి , వరి పంట సాగుచేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారని అన్నారు. నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం రెవిన్యూ వ్యవసాయ శాఖ అధికారులతో పంట వివరాలను సేకరించి నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ధాన్యం తడిసినా, మొలకొచ్చినా ప్రభుత్వమే బాధ్యత వహించాలి..
కొనుగోలు కేంద్రాల వద్దకు అమ్ముకునేందుకు తీసుకువచ్చిన వరి ధాన్యమును కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యాన్ని తడవకుండా భద్రపరచుకునేందుకు సౌకర్యం కల్పించాలని అధికారులకు సూచించారు. కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చిన ధాన్యం తడిసినా, మొలకొచ్చినా ప్రభుత్వమే బాధ్యత వహించి ధాన్యమును కొనుగోలు చేయాలని అన్నారు . పండించిన వరి పత్తి పంటను అమ్ముకునేందుకు సీసీఐ, ధాన్యం కొనుగోలుకు కేంద్రాలకు వచ్చిన రైతులకు తేమ , తాలు , రంగు సాకులతో ఇబ్బంది కలిగిస్తే పెద్ద ఎత్తున రైతులతో ఉద్యమాలను చేస్తామని హెచ్చరించారు.
ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి సీసీఐ, దాన్యం కొనుగోలు కేంద్రాలలో కొనుగోళ్లను ప్రారంభించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి సాగర్ల మల్లేష్ , మండల కమిటీ సభ్యుడు మిర్యాల భరత్, వరికుప్పల ముత్యాలు, యాసరాణి శ్రీను, కట్ట లింగస్వామి, వేముల లింగస్వామి, పగిళ్ల మధు, వడ్లమూడి హనుమయ్య, కొంక రాజయ్య తదితరులు ఉన్నారు.
Landslides | భారీ వర్షానికి శ్రీశైలం ఘాట్ రోడ్డులో విరిగిపడిన కొండచరియలు.. ట్రాఫిక్కు అంతరాయం
Suicide: భార్యతో వీడియో కాల్లో మాట్లాడుతూ.. సౌదీలో ఆత్మహత్య చేసుకున్న భర్త
Jaanvi Swarup | హీరోయిన్గా మహేష్ బాబు మేనకోడలు..సంతోషం వ్యక్తం చేసిన మంజుల