చందంపేట, ఆగస్టు 19 : ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని దేవరకొండ ఆర్డీఓ రమణారెడ్డి అన్నారు. మంగళవారం చందంపేట మండలంలోని తెల్దేవర్పల్లి గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను ఆయన పరిశీలించి మాట్లాడారు. ఇందిరమ్మ ఇండ్లను త్వరగా పూర్తిచేసేలా హౌసింగ్ అధికారులు చొరవ చూపాలన్నారు. గ్రామంలో మొత్తం 18 ఇల్లు నిర్మాణంలో ఉన్నాయని, త్వరగా పూర్తిచేస్తే బిల్లులు జమ చేస్తామని వెల్లడించారు. ఆయన వెంట తాసీల్దార్ శ్రీధర్ బాబు, ఎంపీడీఓ లక్ష్మి, హరికృష్ణ, హౌసింగ్ అధికారులు ఉన్నారు.