చిట్యాల. జూన్ 24 : హోటళ్ల నిర్వాహకులు నాణ్యతా ప్రమాణాలు పాటించాలని చిట్యాల మున్సిపల్ శానిటేషన్ ఇన్స్పెక్టర్ శ్రవణ్ అన్నారు. మున్సిపల్ కమిషనర్ దండు శ్రీను ఆదేశాల మేరకు మంగళవారం మున్సిపల్ పరిధిలోని హాటళ్లు, దాబాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి ఆహర పదార్థాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. హోటళ్లు, దాబాల్లో పరిశుభత పాటించకపోతే చర్యలు తప్పవన్నారు.
వాడే పదార్థాలు రోజుల తరబడి నిల్వ ఉంచకూడదని, వంట సామగ్రిని ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలన్నారు. వంటలకు సంబంధించిన ఆహార పదార్థాలను ఎక్కువ రోజులు ఫ్రిజ్లో నిల్వ ఉంచరాదన్నారు. ఎలాంటి మురుగునీరు హోటళ్ల పరిసరాల్లో ఉండకుండా జాగ్రతలు పాటించాలన్నారు. హోటళ్ల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఆయన వెంట సురేశ్, మున్సిపల్ సిబ్బంది ఉన్నారు.