Home Guard | నందికొండ, జులై 13 : నాగార్జునసాగర్ విజయపురి టౌన్ పోలీస్ స్టేషన్‌కు చెందిన హోంగార్డు ఆంగోతు కిషన్ విధులు నిర్వహిస్తూ గుండెపోటుతో మృతి చెందిన ఘనటన ఆదివారం చోటు చేసుకున్నది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆంగోతు కిషన్ విధి నిర్వహణకై పైలాన్‌కాలనీలోని తన ఇంటి నుండి బయలుదేరి పోతుండగా మార్గం మధ్యలో అస్వస్థతకు గురైనాడు. తీవ్రమైన గుండె నొప్పి రావడంతో తానే స్వయంగా సమీపంలో ఉన్న హిల్‌కాలనీలోని కమలా నెహ్రూ ఏరియా దవాఖానకు వెళ్లాడు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనతో విజయపురి పోలీస్టేషన్లో, కుటంబ సభ్యులలో విషాద చాయలు నెలకొన్నాయి. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపడుతామని ఎస్ఐ ముత్తయ్య తెలిపారు.