క్వింటా పత్తికి రూ.8,309
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో పంట ఉత్పత్తులకు రికార్డు ధరలు పలుకుతున్నాయి.
- సూర్యాపేట మార్కెట్లో రాష్ట్రంలోనే అత్యధిక ధర
బొడ్రాయిబజార్, డిసెంబర్ 9 : సూర్యాపేట జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో పంట ఉత్పత్తులకు రికార్డు ధరలు పలుకుతున్నాయి. శుక్రవారం ఒక్క రోజే మార్కెట్కు 19,020 బస్తాల ధాన్యం తీసుకురాగా క్వింటాకు రూ.2,641 ధర పలికింది. 31 క్వింటాళ్ల పత్తిని రైతులు తీసుకురాగా రాష్ట్రంలోనే అత్యధికంగా క్వింటాకు రూ.8,309 ధర పలుకడంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు. క్వింటా పత్తికి ఖమ్మంలో రూ.8,300, వరంగల్లో రూ.8,025, పెద్దపల్లిలో రూ.8,264, జమ్మికుంటలో రూ.8,150, కేసముద్రంలో రూ.8,209 పలికింది. మార్కెట్ అధికారులు ఎప్పటికప్పుడు జిన్నింగ్ మిల్లులు, రైస్ మిల్లర్లు, ట్రేడర్స్తో మాట్లాడుతూ రైతులకు మంచి ధర పడేలా చూస్తున్నారు.
గ్రామాల్లో అవగాహన కల్పిస్తున్నాం
పత్తి రైతులు దళారులను నమ్మి మోసపోకుండా మార్కెట్కు వచ్చి అధిక ధరకు అమ్ముకునేలా అవగాహన కల్పిస్తున్నట్లు మార్కెట్ ఉన్నతశ్రేణి కార్యదర్శి ఎండీ ఫసియుద్దీన్ తెలిపారు. నిత్యం వరంగల్, ఖమ్మం, కేసముద్రం మార్కెట్లను సంప్రదిస్తూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మంచి ధరలు దక్కేలా చూస్తున్నట్లు చెప్పారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

