చందంపేట, ఆగస్టు 31 : గ్రామంలో ప్రతి గ్రామంలో గ్రంథాలయం ఉండాలని హైకోర్టు జడ్జి సూరేపల్లి నంద అన్నారు. ఆదివారం నల్లగొండ జిల్లా చందంపేట మండలం పోలేపల్లి గ్రామంలో జడ్జి చేతుల మీదగా గ్రంధాలయం ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమాజంలో యువకులకు మంచి ఆలోచన రావాలంటే పుస్తకాలు చదవాలన్నారు. గ్రంథాలయాల ఏర్పాటుకు గ్రామ పెద్దల సహకారం ఉండాలన్నారు. మారుమూల గ్రామంలో కూడా గ్రంథాలయం ఏర్పాటుకు ఆహ్వానించడం ఎంతో సంతోషంగా ఉంది.
అనంతరం నేరేడుగొమ్మ మండలంలోని పెద్ద మునిగలోని తుల్జా భవాని, బ్యాక్ వాటర్ లో ఉన్న శివాల యాన్ని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు పిపి పల్లె నాగేశ్వరరావు, హైకోర్టు బార్ కౌన్సిల్ అధ్యక్షుడు ఎ.జగన్, హైకోర్టు అడిషనల్ పి పి ప్రశాంత్, ప్రవీణ్, వెంకట్ రెడ్డి, అర్జున్, కిరణ్ కుమార్, ఉమామహేశ్వర్, రమా శంకర్, వేణుగోపాల్, నాగిళ్ల జున్ను ఇద్దయా, తాసిల్దార్ శ్రీధర్ బాబు, లోకసాని పద్మా రెడ్డి, మాజీ సర్పంచ్ జంగమ్మ, నోముల వెంకటయ్య, పెద్దలు, పగిల నరసింహ ఉన్నారు.