యాదగిరిగుట్ట/చౌటుప్పల్, జూన్5 : జిల్లా వ్యాప్తంగా బుధవారం పలుచోట్ల వర్షం కురిసింది. భువనగిరి, యాదగిరి గుట్ట, చౌటుప్పల్ తదితర మండలాల్లో వర్షం పడింది. యాదగిరి గుట్టలో ఈదురు గాలులకుతోడు వడగండ్లు పడ్డాయి.
20 నిమిషాలపాటు కురిసిన వర్షానికి పలు ప్రాంతాల్లో విద్యుత్‌కు అంతరాయం వాటిల్లింది. ఈదురుగాలులకు కొండపైన చలువ పందిళ్లు కూలాయి. తూర్పు రాజగోపురం వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన షెడ్డు ధ్వంసమైంది. గుట్టలో 35.5 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. చౌటుప్పల్‌లో గంటపాటు కురిసిన భారీ వర్షానికి రోడ్లపై వరద పొంగింది.